ప్రియుడు రాకేష్‌తో జోర్దార్ సుజాత బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..

బుల్లితెరపై రాకేష్, సుజాత కలిసి చేసిన సందడి అంతా ఇంతా కాదు. వీరిద్దరూ గోవా బీచుల్లో కూడా కలిసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా కలిసే దుబాయ్‌కి వెళ్లి అక్కడ హ్యాపీగా సమయం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే దుబాయ్‌లో సుజాత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాడు రాకేష్‌. ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నాడు. నిజానికి వీరిద్దరూ ఇప్పుడు ప్రేమలో ఉన్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.

ఈ లవ్ బర్డ్స్ జబర్దస్త్ షోతో ఒక్కటయ్యారు. రాకేష్‌ స్కిట్లలో సుజాత యాక్ట్ చేసింది. స్కిట్లలో వారి రొమాంటిక్ ట్రాక్‌ బాగా క్లిక్ అయింది. అలా వారిద్దరూ బుల్లితెరపై జర్నీ చేస్తూ ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు. చివరికి ప్రేమలో పడ్డారు. తెలంగాణ యాసలో జోర్దార్‌గా జోర్దార్ వార్తలు చెప్పే సుజాత గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఈమె గలగల మాట్లాడే తన మాటలతో యాంకర్‌గా మారి ఆపై బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయింది. ఆ పాపులారిటీతోనే జబర్దస్త్ కామెడీ షోలోనూ ఎంట్రీ ఇచ్చి రాకింగ్‌ రాకేశ్‌తో పరిచయం పెంచుకుంది.

ఇద్దరి మనసులు కలవడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. అప్పట్నుంచి వీరిద్దరూ కలిసే తిరుగుతున్నారు. రాకేష్ ఇంట్లో శుభకార్యం జరిగితే సుజాత తప్పకుండా వెళ్తోంది. ఇక న్యూ ఇయర్‌కి నాలుగు రోజుల ముందే దుబాయ్ కి వెళ్లారు. డిసెంబర్ 29న సుజాత బర్త్‌డే సందర్భంగా రాకేష్ ఆమె పుట్టినరోజు వేడుకలు జరిపాడు. ఆ ఫొటోలను ఇప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసుకున్నాడు. అవి కాస్త వైరల్‌గా మారాయి. ఇద్దరి జోడి బాగుందని త్వరగా పెళ్లి చేసుకోండి అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఫొటోలలో ఒకరికొకరు కేకును తినిపించుకోవడం మీరు చూడవచ్చు.