నటుడు విజయ్ ఆంటోని ఆరోగ్య పరిస్థితి విషమం..!!

కోలీవుడ్లో హీరోగా విజయ్ ఆంటోని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా తెలుగులోకి బిచ్చగాడు సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. నిన్నటి రోజున బిచ్చగాడు -2 సినిమా షూటింగ్ జరుగుతుండగా బోటు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా బిచ్చగాడు-2 సినిమా షూటింగ్ సమయంలో మలేషియాలో ఈ ప్రమాదం జరిగినట్లుగా వార్తలు వినిపించాయి. షూటింగ్ జరుగుతున్న సమయంలో బోట్ అదుపుతప్పి ఎదురుగా ఉన్న పడవని ఢీకొట్టడంతో ఒక్కసారిగా విజయ్ కింద పడడంతో తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం.

Vijay Antony injured during Pichaikkaran 2 shoot - The South First
ఆ వెంటనే ఆయనను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే మలేషియాకు బయలుదేరి విజయ్ పరిస్థితిని తెలుసుకున్నారు. అక్కడ నుంచి విజయ్ చెన్నైకు తరలించినట్లుగా విజయ్ భార్య ఫాతిమా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం విజయ్ పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లుగా ఆమె తెలియజేసింది. విజయ్ ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని అతని పళ్ళు కూడా విరిగిపోయాయని.. దవడ ఎముక విరిగినట్లుగా కూడా తెలియజేసింది. ఇక ముఖానికి కూడా గట్టి దెబ్బలు తగిలినట్లు అక్కడ చిత్ర బృందంలో ఒక యువకుడు తెలియజేసినట్లు విజయ్ భార్య ఫాతిమా తెలియజేస్తోంది.

దీంతో విజయ్ అభిమానులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విజయ్ ఆంటోని ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. దీంతో ప్రస్తుతం విజయ్ ఆరోగ్య పరిస్థితి విని అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ ఆంటోనికి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది