హ‌న్సిక గొప్ప మ‌న‌సుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఇంత‌కీ ఏం చేసింది?

యాపిల్ బ్యూటీ హ‌న్సిక ఇటీవ‌ల ఓ ఇంటిది అయిపోయిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది డిసెంబర్ 4న ప్రియుడు మరియు వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాను హ‌న్సిక‌ వివాహం చేసుకుంది. వీళ్ల పెళ్లి జైపూర్‌లోని చారిత్రక ముండోతా కోటలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

సన్నిహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల స‌మ‌క్షంలో సోహైల్‌, హ‌న్సిక ఒక‌ట‌య్యారు. పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు చిన్న బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీగా కాబోతోంది. ప్ర‌స్తుతం ఈమె చేతిలో డ‌జ‌న్ కు పైగా చిత్రాలు, రెండు వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఇక‌పోతే హ‌న్సికకు సేవాగుణం చాలా ఎక్కువ‌. త‌ర‌చూ సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూనే ఉంటుంది. అలాగే అనాథ పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకుని వారి సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తోంది. ప్ర‌స్తుతం హన్సిక వ‌ద్ద 31 మంది పిల్ల‌లు ఉన్నార‌ట‌.

 

ఈ విషయాన్ని హన్సిక తాజాగా స్వయంగా వెల్లడించింది. పిల్లల‌ను దత్తత తీసుకుని పోషించడం ఎంత సంతోషంగా ఉందని.. సంక్రాంతి రోజున వారికి కొత్త బ‌ట్ట‌లు కొన్ని ఇవ్వడంతో వారు ఎంతో సంతోషించార‌ని.. హ‌న్సిక పేర్కొంది. మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుందని తన తల్లి తనకు చిన్నప్పుడే చెప్పిందని.. అందుకే నటి అయిన తర్వాత అనాధ పిల్లలను దత్తత తీసుకుంటున్నానని హ‌న్సిక తెలిపింది. దీంతో హన్సిక గొప్ప‌ మనసుకు హాట్సాఫ్ చెప్పకుండా నెటిజ‌న్లు ఉండలేకపోతున్నారు.