సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నస్టార్ డైరెక్ట‌ర్‌… అమ్మాయి ఎవ‌రో తెలుసా…!

టాలీవుడ్ నటుడు కమ్ దర్శకుడు అయ‌న‌ వెంకీ అట్లూరి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.. పూజ అనే అమ్మాయితో త్వరలోనే వెంకీ ఏడు అడుగులు వెయ్యబోతున్నాడు. తాజాగా ఈరోజు వెంకీ కొద్ది మంది ఇండస్ట్రీ సన్నిహితుల మధ్య సీక్రెట్ గా వెంకీ అట్లూరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇక ఇప్పుడు ఈ వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలను స్వయంగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు వెంకీ.

From an actor to a successful director: Venky Atluri's journey

ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వెంకీ అట్లూరి ఎంగేజ్మెంట్ ఫోటోలు చూసిన సినీ ప్రముఖులు, ఫాలోవర్స్ ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ ఎంగేజ్మెంట్ వేడుకు ప్రముఖ డైరెక్టర్ నాగ అశ్విన్ భార్య, అశ్వినీదత్ కుమార్తె స్వప్న దత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. వెంకీ టాలీవుడ్‌కు జ్ఞాపకం సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.

ఆ తర్వాత స్నేహ గీతం సినిమాలో నటించడమే కాకుండా ఆ సినిమాకు డైలాగ్స్ కూడా రాశాడు. ఆ తర్వాత కేరింత, ఇట్స్ మై లవ్ స్టోరీ సినిమాలుకు రైటర్ గా పనిచేసి.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో తొలిప్రేమ సినిమా తెరకెక్కించి మొదటి సినిమాతోనే అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత అఖిల్ తో మిస్టర్ మజ్ను, నితిన్ తో రంగుదే సినిమాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం తమిళ్ హీరో ధనుష్ తో సార్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు.