పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నాడని తెలిసిందే. ఇక వీరి కాంబినేషన్లు అనౌన్స్ చేసిన `భవదీయుడు భగత్ సింగ్` సినిమాను పక్కన పెట్టి ఇప్పుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో కోలీవుడ్ హీరో విజయ్ తో దర్శకుడు అట్లీ తెరకెక్కించిన `థెరి` సినిమాను రీమేక్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో హీరో పోలీస్ కావడం అమ్మాయిలపై జరిగే అకృత్యాలపై పోరాటం చేయటం అనే నేపథ్యంలో ఈ పాయింట్‌ను బేస్ చేసుకుని ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారట.
ఇంక దీంతోపాటు ఈ సినిమా రీమిక్ చేయటం వలన పవన్ కళ్యాణ్ షూటింగ్ కు సంబంధించిన డేట్స్ కూడా తక్కువగా అవుతాయట. ఈ సినిమాను కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేయొచ్చని భావిస్తున్నారట అందుకే ఈ రీమేక్ వ్యవహారాన్ని ముందుకు తీసుకువచ్చారని సమాచారం. పవన్ కళ్యాణ్ కు మాత్రం ప్రస్తుతం ఒరిజినల్ స్టోరీస్ తో ప్రయోగాలు చేసే ఆలోచన లేదట. ఆయన ఆలోచన మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైనే ఉంది. ఈ లోపు సినిమాలు చేయడం వల్ల ఎంతోకొంత వచ్చే డబ్బును వెనకేసుకోవాలని అనుకుంటున్నాడట ఆ వచ్చిన సంపాదనను రాజకీయ ప్రచారం కోసం ఉపయోగించు కోవాలి అనుకుంటున్నారట.
అందుకే ఈ రీమిక్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా చివరి దశలో ఉండగానే హరీష్ శంకర్ సినిమాను మొదలు పెట్టాలని భావిస్తున్నాడట. ఇక ఇప్పుడు మరో తాజా అప్డేట్ ఏమిటంటే హరీష్ శంకర్ సినిమాను రేపు గ్రాండ్ గా షూటింగ్ ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం `థెరి` రీమిక్ చేయొద్దు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. అయినా పవన్ అభిమానుల విన్నపాలను పట్టించుకోకుండా ఆ సినిమా చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. పవన్ ఆ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.