మహేష్- త్రివిక్రమ్ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్.. అభిమానులకు పూనకాలే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి మరణం నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌లో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ గురించి అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన హారిక & హాసిని క్రియేషన్స్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.

ఈ సినిమా ‘షూటింగ్‌ను అంతులేని ఉత్సాహంతో శరవేగంగా షూటింగ్‌ని జనవరి నుంచి మొదలు పెట్టబోతున్నామంటూ’ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ ను నాన్ స్టాప్ గా బ్రేకులు లేకుండా జరగనుంది. వీటితోపాటు ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్లు కూడా రానున్నాయని ఆ పోస్టులో పేర్కొంది.

Mahesh babu and trivikram movie official update

ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ మొత్తం మహేష్ తో కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్గొన్న ఫోటోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది మహేష్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇవ్వడంతో వారు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.