మరొకసారి బాంబు పేలుస్తున్న వేణు స్వామి.. కుర్ర హీరో హీరోయిన్ అంటూ..!!

తెలుగు సినీ పరిశ్రమ మొత్తాన్ని ప్రస్తుతం జ్యోతిష్యుడు వేణు స్వామి చాలా హడలు పుట్టిస్తున్నారు. తెలుగు సినిమా పరిస్థితి ఏమాత్రం బాగలేదని ఒక తెలుగు హీరో ఒక తెలుగు హీరోయిన్ చనిపోతారని కామెంట్స్ చేయడం జరుగుతోంది.అయితే ఎప్పుడో వయసు పైబడిన వారు చనిపోవడం కాదు యుక్త వయసు ఉన్న వారే అది కూడా 45 ఏళ్లలోపు ఉన్న వారి చనిపోతారంటూ కామెంట్లు చేయడం జరుగుతుంది. అయితే మేష రాశికి చెందిన ఒక హీరోయిన్ వృశ్చిక లేదా మిధున రాశికి చెందిన ఒక హీరో చనిపోతారని.. బాంబు పేల్చారు.

అయితే హీరో సహజ మరణం లేదా సూసైడ్ ద్వారా మరణిస్తారని తెలిపారు. తనకు వారి పేర్లు కూడా తెలుసు అని కానీ తాను మాత్రం బయట చెప్పనని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది .ఎందుచేత అంటే సమంత ,నాగచైతన్య వివాహం చేసుకున్న సమయంలో వీరిద్దరూ కలిసి ముందుకు వెళితే వీరి వివాహ బంధం ఎక్కువ రోజులు సాగదంటూ కూడా తెలియజేయడం జరిగింది. అయినా సరే వీరిద్దరూ వివాహం చేసుకున్నారు గత ఏడాది అక్టోబర్ నెలలో సమంత నాగచైతన్య విడిపోయారు.

ఇక రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్మిక మందన గతంలో ఆయన దగ్గర పూజలు కూడా చేయించుకోవడంతో ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. రష్మిక ,విజయ్ తో ప్రేమలో పడవద్దు అంటే పడేంది ఆయన జాతకరీత్యా పడుతున్న ఇబ్బందులని రష్మిక కూడా పడవలసి వస్తుందంటూ తెలియజేశారు. ఈ విషయం మీదే తాను ముందుగానే హెచ్చరించాను రష్మిక అని తెలియజేశారు. మరి వేణు స్వామి చెబుతున్న ఆ హీరో హీరోయిన్ ఎవరు అనే విషయం ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది