వచ్చే సంక్రాంతికి అదిరిపోయే బాక్సాఫీస్ వార్ జరగబోతుంది. మన సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలతో పాటు దిల్ రాజు నిర్మిస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న వారసుడు కూడా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ మూడు సినిమాలతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఈ సంక్రాంతికి థియేటర్లో సందడి చేయబోతున్నాయి.
ఆ సినిమాలను కూడా నిర్మాతలు రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆ సినిమాలు వందల కోట్ల కలెక్షన్లను నమోదు చేసే అవకాశం కూడా ఉంది అంటూ అందరూ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆ మూడు సినిమాలను కూడా థియేటర్‌లో రిలీజ్ అయిన 50 రోజులు తర్వాతనే ఓటీటీలో రిలీజ్ అవుతాయని తెలుస్తుంది.
ఈ మధ్యకాలంలో నిర్మాతల మండలి ఈ కొత్త నిర్ణయాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ అయినా ప్లాప్ అయినా కూడా ఓటీటీలో చూడాలంటే 50 రోజులు ఆగాల్సిందే అంటూ ఆ సినిమా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఎన్నో భారీ అంచనాల నడుమ వస్తున్న ఆ సినిమాల విడుదల తేదీల విషయంలో ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. మరి కొద్ది రోజులనే ఆ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
అయితే సంక్రాంతి కనుకగా విడుదలయ్యే సినిమాలను ఓటీటీలో చూడాలంటే చాలా రోజులు వెయిట్ చేయాల్సిందే. అందుకే ఆ సినిమాలను కచ్చితంగా థియేటర్లోనే చూడాలని ప్రేక్షకులను నిర్మాతలు కోరుకుంటున్నారు. మన టాలీవుడ్ సీనియర్ హీరోలో బాలకృష్ణ, చిరంజీవి సినిమాల విషయంలో ఆ సినిమాల నిర్మాతలు ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు కూడా విడదలైన 50 రోజులు తర్వాత మాత్రమే ఓటీటీ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.