“నేను ఆ పని చేయలేదు రా బాబు”.. ఫైనల్లీ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన శ్రీలీల.!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. అదే శ్రీ లీల.. శ్రీ లీల.. శ్రీ లీల ..ఏం మాయ చేసిందో ఏమో తెలియదు కానీ కన్నడ ఇండస్ట్రీని మాయ చేసి తెలుగు ఇండస్ట్రీ పై పడింది ఈ ముద్దుగుమ్మ . పెళ్లి సందడి సినిమాతో తన క్లాస్ టచ్ ను అభిమానులకు చూపించిన శ్రీ లీల ..ధమాకా సినిమాతో మాస్ మహారాజ రవితేజ తో కలిసి మాస్ యాంగిల్ ను అభిమానులకి చూపించింది .

ఈ క్రమంలోనే కుర్రాళ్లు ఆమె జపం చేస్తున్నారు. రీసెంట్గా మాస్ మహారాజ రవితేజ -యంగ్ బ్యూటీ శ్రీలీల కలిసి నటించిన సినిమా ధమాకా. త్రినాధరావు నక్కిన డైరెక్షన్లో తెరకెక్కిన ..ఈ సినిమా దాదాపు 70 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ కొల్లగొట్టింది. కాగా ఈ క్రమంలోనే శ్రీలీల కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అదే ఆమె రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తుందని.. సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా కానీ శ్రీలీల పెద్దగా పట్టించుకోదని ..కేవలం డబ్బు కోసం ఆమె సినిమాలు చేస్తుందని చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోని ధమాకా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీలీల మాట్లాడుతూ వాటికి కౌంటర్ ఇచ్చిపడేసింది. ” నేను ఎప్పుడూ నా దగ్గరికి వచ్చే డైరెక్టర్ విషయాలల్లో అలా మాట్లాడను ..వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకుంటాను ..కంటెంట్ విషయం ఒక్కటే నేను చెక్ చేసుకుంటాను.. డబ్బు కోసం నేను సినిమాలు చేయట్లేదు ..నా ఎంజాయ్మెంట్ కోసమే చేస్తున్నాను.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఫేక్ ..దయచేసి నమ్మొద్దు” అంటూ క్లారిటీ ఇచ్చింది . కేవలం ఇదే కాదు తనపై ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటన్నిటికీ ఒక్క మాటతో చెక్ పెట్టేసింది. ఎప్పటికప్పుడు తనపై వచ్చే గాసిప్ లు పై స్పందిస్తూ అలాంటి వాళ్లకి ఘాటుగా జవాబిస్తుంది. చూడాలి రానున్న రోజుల్లో శ్రీ లీల ఎలా మెప్పిస్తుందో..?