బిగ్ బాస్ -7 కి హోస్ట్ గా మంచు విష్ణు.. ట్రోలింగ్ తప్పదా..?

టాలీవుడ్ లో మంచు విష్ణు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు నటుడుగా పలు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా మంచు విష్ణు గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఈసారి బిగ్ బాస్ -7 కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు అనే వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇక నాగార్జున హోస్టుగా గుడ్ బై చెప్పబోతున్నారని అందుచేతనే బిగ్ బాస్ కు సరికొత్త హోస్టుగా మంచు విష్ణు ను ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Buzz: Is Bigg Boss Season 7 Is Going To Host Manchu Vishnu, Rumors Goes  Viralఅయితే ఈ క్రమంలోనే మంచు విష్ణుకు హోస్ట్ గా చేసే అర్హత లేదంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మంచు విష్ణు హీరో అయినప్పటికీ కూడా హోస్టుగా చేస్తే మాత్రం షో అంతగా పాపులర్ అవ్వదు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ హోస్ట్ గా మంచు విష్ణు చేసిన హీరోగా తనకు ఒక రెస్పెక్ట్ ఇవ్వవలసి ఉంటుంది. ఒకవేళ అందరి అంచనాలను తలకిందులుగా చేస్తూ హోస్ట్ గా మంచు విష్ణు అదరగొడితే పర్వాలేదు కానీ లేకపోతే ప్రతి ఒక్కరు చేతిలో ట్రోల్కు గురవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

మరి ఈ విషయంపై మంచు విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి మరి. దీంతో మంచు అభిమానులు కాస్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో ఎలాంటి విషయం కూడా ఈ ఏడాది కలిసి రాలేదని చెప్పవచ్చు. ఎన్నో సినిమాలలో నటించిన ఎక్కువగా ట్రోలింగ్కి గురవలసి వస్తోంది. మరి వచ్చే ఏడాదిలో మంచు కుటుంబానికి కలిసొస్తుందేమో చూడాలి మరి.