ఈ మధ్యకాలంలో టాలీవుడ్ హీరోయిన్ రష్మిక పైన ఎక్కువగా పలు వివాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పేరు పొందిన రష్మిక ఆ తర్వాత పెద్దగా తన పేరును నిలబెట్టుకోలేక పోతోంది. ఎటువంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న కాంతారా నటుడు డైరెక్టర్ రిషబ్ శెట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ నటుడు కూడా పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించారు. కనడ ఇండస్ట్రీకి చెందిన ఈ ఇద్దరు స్టార్ల మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది.
కన్నడ ప్రేక్షకులు కూడా రష్మికని ప్రతి సందర్భాలలో కూడా టార్గెట్ చేయడంతో ఈమె మరింత వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా కాంతర సినిమాని ఇంకా చూడలేదు.. అనడం కన్నడ ఫాన్స్ ని చాలా ఫీల్ అయ్యేలా చేసింది. దీంతో అప్పటినుంచి రష్మిక పైన ట్రోల్ చేయడం జరుగుతోంది. అయితే ఆ తర్వాత సినిమాను చూసి ఆ విషయాన్ని మేకర్స్ కి తెలియజేశానని దాంతో అభినందనలు కూడా తెలియజేశారని తెలియజేసింది. దీంతో శాంతించిన కన్నడ ఫాన్స్ రష్మికకు కాస్త రిలీఫ్ ఇచ్చారు.
కానీ రష్మి కాను మాత్రం రిషబ్ శెట్టి వదలడం లేదు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అవకాశం ఇచ్చినప్పుడల్లా రష్మిక పైన పంచులేస్తూ ఉన్నారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చిన రిషబ్ మాత్రం తనదైన స్టైల్ లో రష్మిక పైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు. తాజాగా రిషబ్ చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతోంది. రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి నటించిన కిరీక్ పార్టీ సినిమా 2016 డిసెంబర్ 30న విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఇందులో హీరోయిన్గా రష్మిక నటించింది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ రిషబ్ శెట్టి సోషల్ మీడియా వేదికగా ఒక ట్విట్ చేయడం జరిగింది. మా సినిమా విడుదల ఆరేళ్లయినప్పటికీ మా కోసం మీరు చేసిన సందడి థియేటర్లలో మీరు వేసిన విజిల్స్ మా చెవుల్లో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి అంటూ. ఈ సెలబ్రేషన్స్ కి భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ రక్షిత్ శెట్టి నిర్మాణ సంస్థ పరంబ స్టూడియోస్ మ్యూజిక్ డైరెక్షన్ లోక్నాథ్ పేర్లను ట్యాగ్ చేయడం జరిగింది. అయితే ఇందులో హీరోయిన్ పేరు లేకపోవడంతో ఈ విషయం చాలా వైరల్ గా మారుతుంది.
'ಕಿರಿಕ್ ಪಾರ್ಟಿ' ನೆಡೆದು ಆರು ವರ್ಷಗಳ ನಂತರವೂ ಪಾರ್ಟಿಗೆ ಕಳೆ ತಂದ ನಿಮ್ಮ ಸದ್ದು, ಗದ್ದಲ, ಸಿಳ್ಳೆಗಳು ಇನ್ನೂ ಕಿವಿಯಲ್ಲಿ ಪ್ರತಿಧ್ವನಿಸುತ್ತಿವೆ. ಮತ್ತೆ ಹಿಂತಿರುಗಿ ನೋಡುವಂತೆ ಮಾಡುತ್ತವೆ. ಈ ಸಂಭ್ರಮದ ಭಾಗವಾದ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ಧನ್ಯವಾದಗಳು. @rakshitshetty @ParamvahStudios @AJANEESHB #KirikParty pic.twitter.com/Rgaq5Lywmq
— Rishab Shetty (@shetty_rishab) December 30, 2022