బాలయ్య- చిరంజీవి సినిమాలలో హైలెట్స్ ఇవే..?

ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాలలో బాలయ్య వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు గట్టి పోటీగా నిలవనున్నాయి. కేవలం ఒక్కరోజు తేడాతోనే ఈ సినిమాలు రెండు విడుదలవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తూ ఉండడం గమనార్హం. గతంలో ఏ నిర్మాణ సంస్థ చేయని సాహసాన్ని ఈ చిత్ర నిర్మాణ సంస్థలు చేయబోతుండడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అయితే మరి ఈ రెండు సినిమాలలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనే విషయంపై అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. వాటి గురించి తెలుసుకుందాం.

Chiranjeevi and Balakrishna in overdrive mode - TeluguBulletin.com

ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సినిమా బాగా లేదంటే కచ్చితంగా చూడడం మానేస్తున్నారు. ఒకవేళ చిన్న సినిమా అయినా సరే సక్సెస్ అయ్యిందంటే చాలు కచ్చితంగా ఆ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. అలా ఇప్పుడు వీర సింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమాలో కూడా ఫ్యాన్స్ కి పూనకాల తెప్పించే సన్నివేశాలు ఉన్నాయట. ముఖ్యంగా యాక్షన్స్ అన్ని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ డిజైన్ చేయడం జరిగింది. ఇక వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో లుంగీలో ధరించే పవర్ఫుల్ క్యారెక్టర్లొ కనిపించబోతున్నారు.

ఈ సినిమాలో బాలయ్య చైర్ ఫైట్ కూడా చాలా హైలైట్ గా ఉంటుందని సమాచారం. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కీలకమైన పాత్రలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక చిరంజీవి సినిమా విషయానికి వస్తే రామ్ లక్ష్మణ్ గన్ ఫైరింగ్ ఫైట్ వి చాలా స్టైలిష్ డిజైన్ గా చేశారని ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ చాలా హైలెట్ గా ఉంటుందని సమాచారం. ముఖ్యంగా ముఠామేస్త్రి సినిమా స్టైల్ లో ఈ చిత్రం మేకోవర్ చేయడం చాలా హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ఇందులో చిరంజీవి శృతిహాసన్ ల పైన ఒక సరదా ఫైట్ ని డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలకు ఇదే హైలైట్ గా మారడు అన్నట్లు తెలుస్తోంది.