2022లో వచ్చిన తెలుగు సినిమాల్లోని డైలాగులు టపాకుల్లా పేలాయి… వాటిపై ఓ లుక్కేయండి జరా!

దూకుడు సినిమాలో మహేష్ బాబు పాత్ర చెప్పిన ఓ డైలాగ్ మీకు గుర్తుందా? అదేనండి… “సినిమాల ప్రభావం జనాలమీద వుందో లేదో తెలియదు గాని, పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం బాగా వుంది.” అనే డైలాగుని జనాలను దృష్టిలో పెట్టుకొనే దర్శకుడు శ్రీను వైట్ల రాసి వుంటారు. అందులో నిజం లేకపోలేదు. మరీ ముఖ్యంగా మన తెలుగు మాస్ హీరోల సినిమాలకు చాలా ప్రత్యేకించి రైటర్స్ డైలాగులు రాస్తూ వుంటారు. విషయంలోకి వెళితే, ఈరోజుతో 2022కి ఎండ్ కార్డు పడిపోతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో వచ్చిన మన తెలుగు సినిమాలలోని డైలాగులను ఒకసారి ఇక్కడ చూద్దాము.

2022 జనవరినుండి డిసెంబర్ 2022 వరకు లిస్ట్ వారీగా చూస్తే మొదట ‘బంగార్రాజు’ సినిమాలో ఓ మంచి డైలాగుని చూడవచ్చు. “ఈ మనుషులకు బతికున్నప్పుడు ప్రాణం విలువ తెలియదా? పోతేనే తెలుస్తుందా?” ఈ డైలాగుల్లో సత్యం లేకపోలేదు. అలాగే ‘RRR’ సినిమాలోని “తొంగి తొంగి నక్కి నక్కి కాదే.. తొక్కుకుంటూ పోవాలే.. ఎదురొచ్చినోణ్ణి ఏసుకుంటూ పోవాలే” అనే డైలాగ్ చాలా ఫ్యాన్స్ అయింది. ఇక రవితేజ ఖిలాడి సినిమాలోని “ఎప్పుడూ ఒకే టీంకి ఆడటానికి నేషనల్ ప్లేయర్ని కాదు… IPL ప్లేయర్. ఎవడెక్కువ పాడుకుంటే వాడికే ఆడతాను.” అనే డైలాగు మాస్ సర్కిల్లో బాగా తిరిగింది.

ఇక DJ టిల్లు సినిమాలోని “అట్లుంటది మనతోని ముచ్చట” అనే లైన్ కుర్రాళ్ళకి తెగ నచ్చేసింది. దాంతో చాలామంది మిమర్స్ దీనిని వాడేసుకుంటున్నారు. ఇక ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా తీసుకుంటే “ఏంట్రా.. నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా?, ఆడు ప్రేమ కోసం చచ్చాడు.. నేను ఆ టైపు
కాదు.” అనే డైలాగ్ లవర్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఇక మాస్ కా బాప్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలోని “పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు.. బహుశా
గుణపాఠాలు చెబుతాననేమో?” అనే డైలాగ్ అయితే ముఖ్యంగా మెగా ఫాన్స్ కి బాగా ఎక్కేసింది. ఇందులో మీకు నచ్చిన డైలాగ్ వుందో లేదో చూడండి.