“ఆ విషయంలో ఎన్టీఆర్ నా కాళ్లు పట్టుకున్నాడు”..నటి సుధ సంచలన కామెంట్స్..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నా.. కొంతమందిని చూస్తే చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది . వారిని చూస్తే మనకి సొంత అమ్మలాగే అనిపిస్తుంది.. అలాంటి వారిలో ఒకరే ఈ సుధా. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి తనదైన స్టైల్ లో గుర్తింపు సంపాదించుకున్న సుధా.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది . అంతేకాదు అప్పట్లో హీరో తల్లి అంటే అందరికీ ఎక్కువగా గుర్తొచ్చే పేరు సుధనే. చాలామంది స్టార్ హీరోలు ఆమె తెరపై తమకు తల్లిగా ఉండాలి అంటూ ఏరి కోరి తమ సినిమాల్లో పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.

మరీ ముఖ్యంగా ఉదయ్ కిరణ్ తో సుధ కు ఉన్న సంబంధం ఎవరు విడతీయ్యరానిది . కాగా తెరపై ఎలాంటి పాత్రనైనా పండించడంలో సుధా కొట్టినపిండి అని పేరు ఉంది . ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఊపేస్తున్నాయి. అంతేకాదు ఆమె ఎన్టీఆర్ మనస్తత్వం.. ఏలాంటి స్వభావం ..అని క్లియర్గా చెప్పేసింది .

ఆమె మాట్లాడుతూ ..”నేను ఎంతోమంది స్టార్ హీరోలతో నటించాను ..అందరికీ తల్లిగా చేశాను ..అయితే తారక్ లాంటి నటుడిని నేను ఎక్కడ చూడలేదు . ఎంత ఎత్తుకు ఎదిగిన డౌన్ టు ఎర్త్ అనడం ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను . నేను తారక్ తో కలిసి చేస్తున్న సినిమా బాద్షాలో ఇద్దరం కలిసి స్టెప్పులు వేయాలి ..సరదాగా ప్రోగ్రాంలో స్టెప్స్ వేసే సీన్ ఉంటుంది. ఆ టైంలో నాకు డాన్స్ రాదు. నేను వచ్చి రాక నా డాన్స్ తో నేను తంటాలు పడుతూ ఉన్నాను ..ఈ టైంలోనే నాకు కాళ్లు బెణికింది .

అయితే తారక్ దాన్ని గమనించి టక్కున వచ్చిన కాళ్లు పట్టుకొని నన్ను కూర్చోపెట్టి స్ప్రే చేసి ..నా పట్ల కేరింగా ఉన్నాడు. ఆ విషయాన్ని ఇప్పటికి నేను మర్చిపోలేను అంత పెద్ద స్టార్ హీరో నా కాళ్లు పట్టుకోవడం ఏంటి అంటూ షాక్ అయిపోయాను. అప్పుడు అర్థమైంది తారక్ మంచితనం. నా విషయంలోనే కాదు చాలామంది లేడీస్ విషయంలో చాలా పద్ధతిగా బిహేవ్ చేస్తాడు ..అలాంటి కొడుకు అందరికీ ఉండాలి అని .. తారక్ అలా బిహేవ్ చేస్తాడు” అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే సుధా మాటలు వైరల్ గా మారాయి.