ఫస్ట్ టైం ప్రభాస్ నోట బూతు మాట..స్టార్ హీరోకి స్ట్రైట్ వార్నింగ్..?

టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ..ప్రజెంట్ కెరియర్ ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్కొక్క సినిమాకి దాదాపు 120 కోట్లు పారితోషకం అందుకుంటూ సౌత్ లో నే క్రేజియస్ట్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. కాగా ప్రజెంట్ ప్రభాస్ చేతిలో ఐదు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి . అన్ని పాన్ ఇండియా రేంజ్ లో నే తెరకెక్కుతున్నాయి. వీటిల్లో ఏ ప్రాజెక్టు హిట్ అయినా సరే ప్రభాస్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారు మ్రోగిపోతుంది .

అయితే సినిమాలపరంగా నెగిటివ్ అనేదే లేని ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నాడు . 40 ప్లస్ క్రాస్ చేసినా సరే ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంపై ఇండస్ట్రీలో రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి కి సంబంధించిన రూమర్ ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యిందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్ తో త్వరలోనే ప్రభాస్ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాడు అంటూ ఉమర్ సైంధూ కూడా అఫీషియల్ గా ప్రకటించాడు.

ఈ క్రమంలోనే ప్రభాస్ – కృతి డేటింగ్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అంతేకాదు మొన్నటికి మొన్న సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ ధావన్ , కృతి కాఫీ విత్ కరణ్ షో కి అటెండ్ అవ్వగా.. వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి. కృతి మనసులో ఒక హీరో ఉన్నాడని ..ప్రజెంట్ ఆ హీరో హైదరాబాద్లో దీపిక పదుకొనేతో షూట్లో పాల్గొంటున్నాడని చెప్పాడు.

దీంతో ప్రాజెక్ట్ కే సినిమాలో భాగంగా దీపికా పదుకొనే తో ప్రభాస్ షూటింగులో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అఫీషియల్ గా ఫిక్స్ అయిపోయారు జనాలు. కాగా రీసెంట్గా కృతి అలాంటిది ఏదీ లేదని ..వరుణ్ నోటి దూల ఎక్కువ అని ..టంగ్ స్లిప్ అయ్యాడని ..మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని ప్రభాస్ కు నాకు మధ్య ఏం లేదని చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే ప్రభాస్ సైతం హీరో వరుణ్ ధావన్ పై మండిపడినట్లు బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది . అంతేకాదు ఏకంగా ఎఫ్**** అనే బూతు పదంతో సరదాగానే స్ట్రైట్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది . ఏది ఏమైనా సరే వరుణ్ దావన్ టంగ్ స్లిప్ అయ్యి ప్రభాస్ అభిమానులను హర్ట్ చేసాడు. ఏది ఏమైనా పెళ్లి విషయంలో ప్రభాస్ త్వరగా ఒక నిర్ణయం తీసుకుంటే అభిమానులతో పాటు సెలబ్రిటీలు హ్యాపీగా ఉంటారు అంటున్నారు ఫ్రెండ్స్.

Share post:

Latest