“ఇవానా” ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. నిన్న మొన్నటి వరకు అసలు ఈ పేరు చెప్తే గుర్తుపట్టే జనాలే లేరు . కానీ లవ్ టు డే సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఆమె పేరు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలోనూ వెండితెర పైన బుల్లితెర పైన ఎక్కడ చూసినా ఒకటే పేరు ఎక్కువగా వినిపిస్తుంది.
ల్వ్ టు డే సినిమాలో తన నటనకు మంచి మార్కులు వేయించుకున్న ఇవానా త్వరలోనే తెలుగు తెరపై మెరవబోతున్నట్లు తెలుస్తుంది . టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్న దిల్ రాజు ఈమెను ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతలు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే . అతన్ని హీరో గా పెట్టి మరో రొమాంటిక్ త్రిల్లర్ మూవీని తెరకెక్కించే విధంగా ప్లాన్ చేశాడట దిల్ రాజు .
ఈ సినిమాలో హీరోయిన్గా ఇవానాను తీసుకోబోతున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై దిల్ రాజు.. సుకుమార్ డైరెక్షన్లో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. అంతే కాదు దీనికోసం ఏకంగా ఇవానా కు కోటి రూపాయలు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతుంది.
అయితే తెలుగులో మొదటి సినిమాకే కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు . అమ్మడులో ఏదో తెలియని మేటర్ ఉందని ఆ మేటర్ దిల్ రాజు పసిగట్టాడు కాబట్టి ఇంతటి ప్రిఫరెన్స్ ఇస్తున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది . చూడాలి మరి ఇవానా ఏ రేంజ్ లో ఈ పాత్ర తో మెప్పిస్తుందో..?