టాక్ అలా, క‌లెక్ష‌న్స్ ఇలా.. `18 పేజెస్‌` 2 డేస్ టోట‌ల్ వ‌సూళ్లు ఎంతంటే?

యంగ్ అండ్ టాలెంటెడ్‌ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `18 పేజెస్‌`. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. సుకుమార్ క‌థ అందించ‌గా.. గోపీ సుందర్ సంగీతం అందించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ ఫీల్ గుడ్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ డిసెంబ‌ర్ 23న అట్ట‌హాసంగా విడుద‌లై.. పాజిటివ్ టాక్‌ను అందుకుంది.

అయితే టాక్ బాగున్నా.. పోటీగా ధ‌మాకా ఉండ‌టంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఊహించిన స్థాయిలో వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేక‌పోతోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం.. రెండో రోజు రూ.1.06 కోట్ల షేర్‌తో స‌రిపెట్టుకుంది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ.1.22 కోట్ల షేర్ ని సాధించింది. ఇక ఏరియాల వారీగా 18 పేజెస్ 2 డేస్ టోట‌ల్ వ‌సూళ్ల‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 1.25 కోట్లు
సీడెడ్: 23 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 27 ల‌క్ష‌లు
తూర్పు: 18 ల‌క్ష‌లు
పశ్చిమ: 10 ల‌క్ష‌లు
గుంటూరు: 11 ల‌క్ష‌లు
కృష్ణ: 8 ల‌క్ష‌లు
నెల్లూరు: 6 ల‌క్ష‌లు
———————————–
ఏపీ+తెలంగాణ = 2.28 కోట్లు(4.45 కోట్లు~ గ్రాస్‌)
———————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 25 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్‌ – 48 ల‌క్ష‌లు
—————————————–
వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్ = 3.01 కోట్లు(6.05 కోట్లు~గ్రాస్)
—————————————–

కాగా, రూ. 12.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా.. మొద‌టి రెండు రోజులు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 9.49 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుంటే బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్‌గా నిలుస్తుంది. కానీ, ఈ టార్గెట్‌ను అందుకోవాలంటే ఇప్పుడున్న జోరు స‌రిపోద‌నే చెప్పాలి.