మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ సినిమాకు క‌ళ్లు చెదిరే బ‌డ్జెట్‌.. తేడా వ‌స్తే ఇక అంతే!?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసింది. మహేష్ కు ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించబోయే ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయింది.

శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఉన్నాయి. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. దసరాకు ముందే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇంతలో మహేష్ ఇంట వ‌రుస విషాదాలు చోటుచేసుకోవ‌డంతో షూటింగ్ కు బ్రేక్ ప‌డింది. అయితే ఈ గ్యాప్ లో త్రివిక్ర‌మ్ స్క్రిప్ట్ మొత్తాన్ని మార్చేశారు. ఇక కొత్త స్క్రిప్ట్ తో మళ్ళీ కొత్తగా షూటింగ్ ను ప్రారంభించేందుకు మేకర్స్ స‌న్నాహాలు చేస్తున్నార‌ని టాక్ న‌డుస్తోంది.

అయితే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ కథతో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రానికి మేక‌ర్స్ ఏకంగా రూ.180 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట. జనవరిలో షూటింగ్ ప్రారంభించి దసరాకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్ సన్నాహాలు చేస్తున్నారట. ఏదైనా హై బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా రిజ‌ల్ట్ లో ఏ మాత్రం తేడా వచ్చినా నిర్మాతలకు భారీ నష్టాలు వాటిల్లే అవకాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.