ప్రభాస్ కంటే బాలయ్య పెద్ద ఆకతాయి.. న‌య‌న్ షాకింగ్ కామెంట్స్‌!

లేడీ సూపర్ స్టార్ నయనతార `కనెక్ట్` అనే హారర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, సత్య రాజ్ తదితరులు కీలకపాత్రలను పోషించారు.

డిసెంబర్ 22న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తెలుగులో యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. సొంత‌ బ్యానర్ కావడంతో నయనతార తన సినిమాను గట్టిగానే ప్రమోట్ చేసుకుంటుంది. తెలుగులో తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అలాగే న‌ట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

బాలకృష్ణ తో నయనతార సింహ, జై సింహ తదితర చిత్రాల్లో నటించింది. అయితే బాలకృష్ణతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి ప్రశ్నించగా.. `బాలకృష్ణ సార్ తో నేను డిఫరెంట్ జానెర్స్ లో మూవీస్ చేశాను. ఆయన్ని చూసి అందరూ భయపడతారు. కానీ ఆయ‌న చాలా సర‌దా వ్య‌క్తి. ఇంతకుముందు నేను ప్రభాస్ ఆకతాయి వ్యక్తి అని చెప్పాను. అయితే నిజానికి బాలకృష్ణ సర్ ప్రభాస్ కంటే పెద్ద ఆకతాయి` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్‌ కాస్త ఇప్పుడు నెట్టింట‌ వైరల్ గా మారాయి.