మొదలైన వీరసింహారెడ్డి హంగామా.. రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరిరైన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం జెడ్ స్పీడ్ లో సినిమాలు చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం అఖండ లాంటి సూపర్ హిట్ తర్వాత బాలయ్య నుండి వస్తున్న సినిమా వీర సింహారెడ్డి. ఇప్పటికే దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను రవితేజ కు క్రాక్ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై టాలీవుడ్ లో భారీ అంచనాలను నెలకొన్నాయి. బాలకృష్ణకు కలిసి వచ్చిన సీమ బ్యాక్ డ్రాప్ లో.. అలాగే సింహా -రెడ్డి పదాలతో టైటిల్ ఉండటం. ఇక ఇదే బాలకృష్ణ అభిమానులకు మరో కలిసి వచ్చే విషయమని చెప్పాలి.

రెడ్డి ఓట్లే టార్గెట్ గా... 'వీరసింహారెడ్డి'? | balakrishna new movie name  veerasimhareddy - Telugu Oneindia

ఈ సినిమాతో బాలకృష్ణ మరో అదిరిపోయే హిట్ కచ్చితంగా ఇస్తాడని బాలయ్య అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది.. అఖండకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన థ‌మన్ ఈ సినిమా కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థగా ఉన్న మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్ తో పాటు జై బాలయ్య సాంగ్, సుగుణ సుందరి సాంగ్ బాలయ్య అభిమానులనే కాకుండా సగటు ప్రేక్షకులను కూడా ఎంతో ఆకట్టుకున్నాయి.

బాలయ్య 'వీరసింహారెడ్డి' సెకండ్ సింగిల్ కు డేట్, టైమ్ ఫిక్స్.. లవ్లీ పోస్టర్  విడుదల చేసిన మేకర్స్!

అయితే ఈ సినిమా నుండి ఇప్పటివరకు వచ్చిన టీజర్ రెండు పాటలలో బాలయ్య డాన్స్ కూడా అదిరిపోయింది. ఈ సినిమా మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ కు కూడా నచ్చే విధంగా ఉంటుందని ఇప్పటికే విడుదలైన రెండు పాటలను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా రిలీజ్ కి మరో 20 రోజులు టైమ్‌ ఉండగానే బాలయ్య అభిమానులు రచ్చ మామూలుగా లేదు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

Veera Simha Reddy: వీరసింహారెడ్డికి తలనొప్పిగా మారిన 'జై బాలయ్య'... వచ్చిన  హైప్ మొత్తం పోయింది! - OK Telugu

అయితే బాలయ్య అభిమానులు మ‌త్రం ఇప్ప‌టి నుంచే థియేటర్స్ దగ్గర వాళ్ళ హంగామా మొదలుపెట్టారు. మరో 20 రోజుల టైమ్‌ ఉండగానే థియేటర్ల దగ్గర చేరిపోయి వీర సింహారెడ్డి స్టాండ్స్ తో రచ్చ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్స్ లో ఒకటైన భ్రమరాంబా థియేటర్లో వీర సింహారెడ్డి స్టాండీస్ ఏర్పాటు చేసి వాటికి పాలాభిషేకాలు, పూలదండలతో బాలయ్య అభిమానుల చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.