గుణ‌శేఖ‌ర్ కూతురు పెళ్లి సాక్షిగా బ‌ట్ట‌బ‌య‌లైన మ‌హేష్ – బ‌న్నీ గొడ‌వ‌లు…!

టాలీవుడ్ స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగడం సర్వసాధారణం అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. వీరిద్దరి అభిమానుల మధ్య మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ఎప్పుడు కొట్టుకునే బ్యాచ్ లో ఈ వీరిద్దరి అభిమానులు ముందుంటారు. అయితే ఇలాంటి మనస్తత్వం ఉన్న అభిమానుల మధ్య గొడవలు రాకుండా చూసే బాధ్యత కచ్చితంగా ఈ ఇద్దరి హీరోల పైన ఉంటుంది.

Mahesh Vs Bunny.. What message are you giving to the fans?

తాము కలిసే ఉన్నామని మా మధ్య ఎలాంటి గొడవలు లేవు స్నేహంగా ఉంటున్నామనే విషయాన్ని ఎప్పటికప్పుడు వారి అభిమానులకు చెప్పినప్పుడు మాత్రమే ఈ అభిమానుల మధ్య గొడవలు తగ్గుతాయి. అయితే ఈ ఇద్దరి వ్యవహార శైలి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటుంది. తాజాగా నిన్న టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ కూతురు నీలిమ గుణ ప్రముఖ వ్యాపారవేత్త రవి ప్రఖ్యతో రీసెంట్‌గా వీరిద్దరికీ వివాహం జరగగా నిన్న వీరి రిస్పెప్షన్ ఏర్పాటు చేయగా.. ఆ ఫంక్షన్ కు టాలీవుడ్ లో ఉన్న ప్రముఖులు స్టార్ హీరోలు అందరూ హాజరయ్యారు.

అయితే ఈ ఫంక్షన్‌కు మహేష్ బాబు, అల్లు అర్జున్ కూడా వచ్చారు. అయితే ఇందులో ఎవరి మానాన వారు వచ్చి వెళ్లిపోతే ఏ గొడవ ఉండేది కాదు. కానీ ఈ ఫంక్షన్‌కు ఇద్దరు ఓకే టైం కు ఆ వేదిక మీద తారసపడ్డంతో పెద్ద సమస్యగా మారింది. అల్లు అర్జున్ రాకముందే అక్క‌డ‌కు వ‌చ్చి మహేష్ బాబు స్టేజ్ పై ఉన్న వధూవరులను ఆశీర్వదిస్తుండగా అదే టైంలో అల్లు అర్జున్ కూడా అక్కడికి రావడంతో గుణశేఖర్ బన్నీని దగ్గరుండి స్టేజ్ మీదకు తీసుకువచ్చాడు. అక్కడే మహేష్ బాబును చూసేసరికి బన్నీ కొంత అసహనానికి గురయ్యాడు.

Can Mahesh Babu vs Allu Arjun clash be averted? | The News Minute

అయినప్పటికీ కొంత తడబడకుండా ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. తర్వాత వాళ్ళిద్దరూ ఎవరు పని వారు చూసుకుని వెళ్ళిపోయారు. మహేష్ కూడా బన్నీతో ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఇదే టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో బన్నీకి మహేష్ బాబుకు ఉన్న గొడవల వల్ల ఎలా జరిగిందంటూ కామెంట్ లో వస్తున్నాయి. దీంతో పాటు ఇద్ద‌రి అభిమానులు కూడా ఎవ‌రి స్టైల్లో వారు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ ఎవరికి తోచినట్టు వారు ఈ విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.