గత కొంతకాలంగా బాలీవుడ్ హీరోలు నటించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం బాలీవుడ్ జనాలు అందరూ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో ఎదురుచూస్తున్న సినిమా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న పఠాన్. ఈ సినిమాను వచ్చే రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టీజర్ ను మేకర్స్ విడుదల చేయగా భారీ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. అయితే ఈ సినిమాలో షారుక్ ఖాన్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే నటిస్తుంది.
ఈ సినిమాలో దీపికా తన అందాల ఆరబోతతో యువతకు పిచ్చెక్కించబోతుంది అంటూ గత కొద్దిరోజులుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేయగా ఈ పాటను తెలుగులో కూడా ‘నా నిజ రంగు’ అంటూ వచ్చిన ఈ వీడియో సాంగ్ యూట్యూబ్ లో తెగ వైరల్ గా మారింది. ఈ పాటలో దీపక అందాలకు జనాలు ఫిదా అవుతున్నారు. ఇక ఈ పాటలో దీపికను బికినీలు చూస్తుంటే మతి పోతున్నట్టుగా కామెంట్లు వస్తున్నాయి.
ఆమె తన అందంతో మరియు హావ భావాలతో బికినీ షో తో బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా గుండెల్లో వేడి పుట్టిస్తుంది. ప్రస్తుతం దీపిక ఈ సినిమాతోపాటు తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి నటించిన సర్కస్ లో కూడా ఇదే తరహా అందాల ఆరబోతతో ప్రత్యేకంగా దీపిక కనిపించనుంది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతుతో పాటు తన నటన విషయంలో కూడా టాప్ అనిపించుకుంటుంది. ప్రస్తుతం దీపిక బాలీవుడ్ లో పలు బడా సినిమాల్లో నటిస్తూ బిజీగా కొనసాగుతుంది. వీటితోపాటు ప్రభాస్ హీరోగా వస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాలో కూడా దీపికా నటిస్తుంది.