బాలకృష్ణ వ్య‌క్తిత్వంపై బోయ‌పాటి మైండ్ బ్లోయింగ్ కామెంట్స్‌…!

టాలీవుడ్ మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీను మాస్ యాక్షన్ సినిమాల‌కు పెట్టింది పేరు. సినీయ‌ర్ ద‌ర్శ‌కుడు బి. గోపాల్ త‌ర్వాత‌ బాలకృష్ణతో ఏకంగా మూడు సినిమాలను తెరకెక్కించి సూప‌ర్‌ హిట్‌ అందుకున్నాడు బోయపాటి శ్రీను. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో బోయపాటి అన్న వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Boyapati Not To Repeat VVR Mistakes?

గత సంవత్సరం బాలకృష్ణ తో అఖండ సినిమా తీసి బాలకృష్ణకు అదిరిపోయే హిట్ ఇచ్చాడు బోయపాటి. త్వరలోనే వీరి కాంబోలో అఖండకు సీక్వల్ కూడాా రాబోతుందని తాజాగా జరిగిన ఫీలింగ్ ఫెస్టివల్ ఈవెంట్‌లో ఆయన స్పష్టం చేశాడు. ఆ ఇంటర్వ్యూలో తనకు.. బాలయ్య బాబుకు ఉన్న సాన్నిహిత్యం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఇక బాలయ్య బాబు చాలా గ్రేట్ అంటూ.. సినిమా షూటింగ్ విషయంలో డైరెక్టర్లకు ఆయన ఎంతో గౌరవం ఇస్తార‌న్నారు.

Balakrishna, Boyapati to Create Tremendous Record! | cinejosh.com

దర్శకుడు ఏది చెబితే అది చేయాలని… ఎప్పుడు దర్శకుడు కి ఎదురు చెప్పకూడదని బాలయ్య చెబుతూ ఉంటారు. షూటింగ్ మొదలు అయ్యే సమయానికి సెట్ కి వచ్చేస్తారు… అయ‌న‌ది చిన్నపిల్లల మనస్తత్వం అందరితోనూ కలిసిపోతూ ఉంటారు. ఇండ‌స్ట్రీలో పలు వివాదాలకు ఆయన ఎప్పుడు దూరంగా ఉంటారు. బాలయ్య బాబుతో ఎప్పుడు నేను సినిమా చేసినా.. అది నాకు సూపర్ హిట్ ఇస్తుంది.. అంటూ బోయపాటి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Veera Simha Reddy: 'వీరసింహారెడ్డి' గా బాలయ్య.. మాస్ లుక్ లో అరాచకం - NTV  Telugu

బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో త‌న 107వ సినిమా వీరసింహారెడ్డిలో న‌టిస్తున‌ విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకాగా జనవరి 12వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్పటికే వీరసింహారెడ్డి సినిమాతో చిరంజీవి వాల్తేరు విరయ్య‌, విజయ్ వారసుడు, అజిత్ తెగింపు సినిమాలు పోటీ పడుతున్నాయి.