వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగబోతున్న చిత్రాల్లో `వారసుడు` ఒకటి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. తమిళంలో `వరిసు` టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మించారు.
ఈ సినిమా విడుదల విషయంలో మొదటి నుంచి వివాదం జరుగుతుంది. తెలుగులో ఈ డబ్బింగ్ సినిమా కోసం దిల్ రాజు వల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డికి చిత్రాలకు థియేటర్లు లేకుండా చేస్తున్నారంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో `వారసుడి`కే ఎక్కువ ధియేటర్స్ కేటాయిస్తున్నారు. ఈ విషయాల్లో దిల్ రాజు పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
అయినా సరే దిల్ రాజు అవేమి పట్టించుకోకుండా `వారసుడు`ను జనాల్లోకి తీసుకువెళ్లేందుకు గట్టిగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఓ బిగ్ స్కిచ్ వేశారట. `వారసుడు(వరిసు)` ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుని గెస్ట్ గా రంగంలోకి దింపబోతున్నారట. ఇప్పటికే మహేష్‌ను సంప్రదించగా.. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ నడుస్తోంది. ఏదేమైనా మహేష్ `వారసుడు` ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంటే.. ఈ సినిమాకు ఖచ్చితంగా మరింత బజ్ ఏర్పడిన ఖాయం.