యంగ్ సన్సెషన్ శ్రీలీల `పెళ్లి సందD` సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే రోషన్ మేక వంటి యంగ్ హీరో మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రీలీల.. తండ్రి వయసున్న రవితేజతో `ధమాకా` సినిమాలో రొమాన్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ విషయంలో గత కొద్ది రోజుల నుంచి శ్రీలీలపై విమర్శలు వస్తునే ఉన్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై శ్రీలీల స్పందించింది. పెళ్లి సందD కంట ముందే ధమాకా ఆఫర్ వచ్చిందని, వయసుతో తనకు సంబంధం లేదని రవితేజ వంటి హీరోతో నటించడం తన లక్ అని శ్రీలీల పేర్కొంది. అంతేకాదు సినిమాలో తన పాత్ర నచ్చడం వల్లే ధమాకా ఓకే చేశానని చెప్పుకొచ్చింది.
కాగా, ధమాకా విషయానికి వస్తే.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.