2022: ఈ ఏడాది తెలుగులో వచ్చిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఇవే..

ఈ ఏడాది లేడీ ఓరియంటెడ్ సినిమా వేరే భాషాలతో పోలిస్తే తెలుగులో చాలా తక్కువగా రిలీజ్ అయ్యాయి. ఒకప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే ఎక్కువగా గుర్తొచ్చే పేరు అనుష్క. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లకు అనుష్కలాగా సినిమాని సోలోగా నడిపించే సామర్ధ్యం తక్కువ అనే చెప్పాలి. అందుకే కాబోలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఈ ఏడాది చాలా తక్కువగా వచ్చాయి. రిలీజ్ అయిన కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలో హిట్ అయిన ఒకే ఒక సినిమా సమంత నటించిన ‘యశోద’.

యశోద

హరి శంకర్, హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించిన యశోద సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో 2022 లో పెద్ద హిట్ అందుకుంది సామ్. సరోగసి బ్యాక్‌డ్రాప్‌తో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన యశోద సినిమాకి రూ.37 కోట్ల వరకూ వసూలు చేసింది. ఈ సినిమా ఒక పెద్ద క్రైమ్ ను బయటపెట్టే పోలీస్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన ఒక సాధారణ మహిళగా సమంత నటించింది.

గుడ్ లక్ సఖి

గుడ్ లక్ సఖి సినిమాకి నేషనల్ అవార్డు విన్నర్ నగేష్ కుకునూరు దర్శకత్వం వహించారు. ఈ ఏడాది ప్రారంభంలో కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా దురదృష్టవంతురాలిగా సమాజంలో ముద్రపడిన ఓ మహిళ తన పట్టుదలతో షూటింగ్ గేమ్‌లో ఎలా రాణించిందో చెబుతుంది. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది.

శాకిని డాకిని

సుదీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శాకిని డాకిని సినిమాలో నివేదా థామస్ హీరోయిన్‌గా నటించింది. కొరియన్ సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’ అనే సినిమా ఆధారంగా తీసిన ఈ సినిమాలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఇద్దరూ మహిళలు ఎలా పట్టుకుంటారనేది స్టోరీ. ఈ సినిమా ప్లాప్ అయింది.

జయమ్మ పంచాయితీ

జయమ్మ పంచాయితీ సినిమాలో యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించింది. రిలీజ్‌కు ముందు ఈ సినిమా ప్రమోషన్స్‌కి రాజమౌళి, రామ్ చరణ్, రానా లాంటి స్టార్ డైరెక్టర్లు, హీరోయిన్లు హాజరయ్యారు, దాంతో ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఎక్కువగా ఊహించారు. కానీ వారు ఉహించినంత అయితే ఏం లేదు. ప్రియమణి నటించిన భామా కలాపం సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యింది కానీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.