టాలీవుడ్ లో గత కొంతకాలం నుంచి సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత బాగా ఏర్పడింది. ముఖ్యంగా బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున వంటి హీరోలకు హీరోయిన్లు తేవడం దర్శకనిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడు బాలయ్య సినిమాకు సైతం అదే సమస్య ఏర్పడింది. ప్రస్తుతం ఈయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రుతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుక జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా అనంతరం బాలయ్య తన 108వ చిత్రాన్ని అనిల్ రావిపూడితో అనౌన్స్ చేశారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహో గారపాటి నిర్మించబోయే ఈ సినిమా కథ తండ్రి కూతురు మధ్య సాగుతుందని, ఇందులో పాలయ్య కూతురుగా శ్రీలీల కనిపించపోతుందని ఇప్పటికే అనిల్ రావిపూడి వెల్లడించారు.
అయితే ఇప్పుడు ఈ సినిమాకు హీరోయిన్ దొరకడం లేదట. బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హా మొదలుకుని మెహ్రీన్ వరకు చాలా మందిని అనిల్ రావిపూడి పరిశీలించారట. కానీ, ఇప్పటి వరకు బాలయ్యకు హీరోయిన్ సెట్ అవ్వలేదట. దీంతో హీరోయిన్ ను వెతకలేక అనిల్ రావిపూడి తలపట్టుకుంటున్నాడని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.