పవన్ కళ్యాణ్ ఖుషి రీరిలీజ్ గురించి భూమిక ఏమన్నారంటే..!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో ఖుషి సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాను కోలీవుడ్ దర్శకుడు ఎస్.జే సూర్య తెరకెక్కించగా. ఈ సినిమాలో పవన్ కు జంటగా భూమిక హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా అప్పట్లోనే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో భూమిక ఒక్కసారిగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సినిమాలో పవన్ నటన, ఆయన యాటిట్యూడ్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. భూమిక కూడా తన అందంతో నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తాజాగా ఇప్పుడూ ఈ సినిమా న్యూ ఇయర్ కానుకగా రీ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమాను డిసెంబర్ 31 న ప్రేక్షకుల ముందుకు భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ సినిమాను మరోసారి థియేటర్లో చూడడానికి పవన్‌ అభిమానులు ఎంతో ఆత్రుతగాా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అవడంతో భారీ స్థాయిలో ఎవరు ఊహించుని రీతిలో టికెట్స్ అన్నీ అమ్ముడైపోతున్నాయి.ఇప్పుడు తాజాగా ఖుషి రిలీజ్ కు సంబంధించి ఈ సినిమా హీరోయిన్ భూమిక ఈ విధంగా స్పందించింది. ప్రస్తుతం విదేశాలలో ఉన్నటువంటి భూమిక ఈ సినిమా రీ రిలీజ్ గురించి స్పందిస్తూ ఒక వీడియో చేశారు.

ఈ సందర్భంగా భూమిక మాట్లాడుతూ ‘ఖుషి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తిరిగి విడుదల అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అద్భుతమైన చిత్రంలో నటించే అవకాశం కల్పించినటు వంటి నిర్మాత ఏయం రత్నం గారికి, డైరెక్టర్ ఎస్ జె సూర్య, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు’. అదే విధంగా ‘న్యూ ఇయర్ లో ప్రతి ఒక్కరూ సంతోషంగా గడపండి అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది’.

 

View this post on Instagram

 

A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t)