సద్దాం ,హైపర్ ఆది మధ్య గొడవలపై క్లారిటీ.. ఇదే..!!

తెలుగు బుల్లితెరపై హైపర్ ఆది జబర్దస్త్ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక మరొక కమెడియన్ సద్దాం కూడా పటాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మాటల్లేవని గతంలో హైపర్ ఆది చేసిన జబర్దస్త్ స్కిట్లు ట్రెండింగ్ లో ఉండేసరికి కామెడీ స్టార్లు స్కిట్లు చేస్తున్న సద్దాం కూడా వీరి పైన పంచులు వేశారని వార్తలు వినిపిస్తూ ఉండేవి. ఇక వీరి మధ్య ఒక యుద్ధం జరుగుతోంది అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉండేవి. దీంతో ఇప్పుడు వీరిద్దరి మధ్య గొడవలపై క్లారిటీ ఇవ్వడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

Dr.Anil - Marketing Musings: Saddam Hussein Vs Hyper Aadi, storm in a  tea-cup or indication of a bigger Malaise?

ఇక తాజాగా ఈటీవీ మల్లెమాలవారు న్యూ ఇయర్ సమీపిస్తూ ఉండడంతో వేర్ ఇజ్ ది పార్టీ అని ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ను ప్లాన్ చేశారు. ఇందులో సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్నది. అందుకు సంబంధించి ఒక ప్రోమో వైరల్ గా మారుతోంది.అందరూ డాన్సులు ఆటపాటలతో చాలా సందడిగా కొనసాగుతోంది. అన్ని ప్రోమోలో మాదిరి ఈ ప్రోమోలో కూడా ఏదో ఒక ట్విస్ట్ మేలి పెట్టారు మల్లెమాల సంస్థ. ఈసారి ఇందులో హైపర్ ఆది, సద్దాం గొడవలను తెరపైకి తీసుకువచ్చారు ఇదే స్టేజి పైన సద్దాం కి తనకి మనస్పర్ధలు లేవని స్వయంగా తెలియజేశారు.

దీంతో ఈ ప్రోమో చాలా వైరల్ గా మారుతోంది . ఇక ఇందులో వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడానికి గల కారణాలు కూడా తెలియజేశారు..అనంతరం వీరిద్దరూ కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటున్నట్లుగా ఈ ప్రోమోలో కనిపిస్తోంది.వీరి అభిమానులు కూడా కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ ప్రోమో మాత్రం వైరల్ గా మారుతోంది.