సంక్రాంతికే కాదు సమ్మర్‌లో కూడా అదే కిక్… తగ్గేదేలే..!

2023 లో సినీ అభిమానులకు పండగే అని చెప్పాలి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల సినిమాలన్నీ మరికొద్ది గంటల్లో రాబోయే కొత్త సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముందుగా కొత్త సంవత్సరంలో పెద్ద పండుగ సంక్రాంతి రోజున టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోలైన చిరంజీవి- బాలకృష్ణ నటిస్తున్న సినిమాలు ముందుగా కొత్త సంవత్సరంలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి.
చిరంజీవి సంక్రాంతి కానుకగా తను నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాను జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

బాలకృష్ణ కూడా తన 107వ సినిమా అయినా వీరసింహారెడ్డిని జనవరి 12న థియేటర్లో దింపబోతున్నాడు. ఈ సినిమాలతో పాటు కోలీవుడ్ స్టార్ హీరోలైన అజిత్, దళపతి విజయ్ నటిస్తున్న వారసుడు, తెగింపు సినిమాలు కూడా ఈ సంక్రాంతి బరిలో ఉన్నాయి. తరవాత వచ్చే సమ్మర్‌లో కూడా టాలీవుడ్ నుంచి బడా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక అందులో ముందుగా సమ్మర్‌ను టార్గెట్ చేసుకొని వస్తున్న సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా గురించే.. ఈ సినిమాను సమ్మర్ స్పెషల్‌గా రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రకటించింది.

Ponniyin Selvan ( PS -1 ) | 33 Interesting Facts | Aishwarya Rai | Vikram |  Karthi | Mani Ratnam - YouTube

మహేష్ బాబు ఇంట్లో తీవ్ర విషాదాలు జరగడంతో ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది. అయితే ఈ సినిమాను ఎలా అయినా అనుకున్న సమయానికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగా త్రివిక్రమ్‌- మహేష్ కూడా ఈ సినిమా షూటింగ్లో త్వరలోనే జాయిన్ అవ్వబోతున్నారట. ఇక అలాగనే మరో భారీ చిత్రం ఈ సంవత్సరం కోలీవుడ్ నుంచి వచ్చిన సినిమాలలో పోనియన్ సెల్వన్‌ కూడా ఒకటి.. ఈ సినిమాను కోలీవుడ్ దర్శకుడు మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్టుగా రెండు భాగాలుగా తెరకెక్కించాడు.

అందులో మొదటి భాగం ఈ సంవత్సరం విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక తర్వాత రెండో భాగాన్ని వచ్చే కొత్త సంవత్సరం ఏప్రిల్ 28న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాతో పాటు చిరంజీవి మెహర్ రమేష్ కాంబోలో వస్తున్న భోళా శంకర్ కూడా సమ్మర్ లో రిలీజ్ కానుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తున్న జైలర్ సినిమా కూడా సమ్మర్ లోనే రానుంది. వీటితోపాటు రవితేజ, సాయి ధరంతేజ్ నటిస్తున్న రావణాసుర, విరూపాక్షా సినిమాలు కూడా వచ్చే సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.