సోషల్ మీడియాకు ప్రభాస్ భయపడుతున్నాడా?

రెబల్ స్టార్ స్టార్ట్ అన్నా, డార్లింగ్ అన్నా తెలుగు పరిశ్రమలో ఒకే ఒక్కడు గుర్తుకు వస్తాడు… అతడే ప్రభాస్. ఇక ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇక తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2లో బాహుబలి విత్ బాలయ్య ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయిన సంగతి విదితమే. ప్రభాస్ ఫ్యాన్స్ గోల భరించలేక ఆహా టీం ఒక్కరోజు ముందే రిలీజ్ చేసింది ఈ ఎపిసోడ్. అలాగే మరోవైపు ప్రభాస్ ఎపిసోడ్ కోసం నందమూరి ఫ్యాన్స్ కూడా ఎంతో ఈగర్ గా ఎదురు చూశారు.

ఇకపోతే రెబల్స్ దెబ్బకు నిన్న ఆహా సర్వర్ క్రాష్ అయిన సంగతి విదితమే. ఒకేసారి ఎక్కువమంది చూడటం వల్ల ఇలాంటి టెక్నీకల్ సమస్యలు తలెత్తుతాయి. ఇక ఎపిసోడ్ మాత్రం చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది. బాలయ్య ప్రభాస్ ఇద్దరూ కూడా చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. ఈ నేపథ్యంలోనే తనకు సోషల్ మీడియా మీద ఎంత భయం వుందో బయటపెట్టాడు ప్రభాస్. అందరికీ తెలిసిందే… ప్రభాస్ కి ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్ పర్సనల్ అకౌంట్స్ అనేవి వుండవు. పేరుకు కొన్ని వున్నా కేవలం వాటిని సినిమా ప్రమోషన్స్ వరకే వాడుతుంటాడు. అయితే అది కూడా తన టీం చూసుకుంటుందని టాక్.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ గురించి కూడా తన భయాన్ని బయట పెట్టాడు ప్రభాస్. ఏదిఏమైనా ప్రభాస్ తో బాలకృష్ణ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 1 మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. ఎపిసోడ్ మధ్యలో ప్రభాస్ చరణ్ ఫోన్ సంభాషణలు కూడా ఆడియన్స్ ని అలరించాయి. ముఖ్యంగా ఒరేయ్ చరణ్ అని ప్రభాస్ అనడం అందరినీ సర్ ప్రైజ్ చేసిందని చెప్పుకోవాలి. కాగా స్టార్ హీరోల మధ్య ఈ సాన్నిహిత్యం వారి ఫ్యాన్స్ ని కూడా అలరిస్తుంది. ఎందుకంటే సినిమాల విషయంలో ఫ్యాన్స్ మధ్య వైరం ఇలాంటి షోల వల్ల స్టార్స్ మధ్య ఉన్న రిలేషన్ అర్థం చేసుకుంటుందని ఆశిద్దాం.