నాగార్జున మల్టీస్టారర్ చిత్రం తో దశతిరిగేనా..?

అక్కినేని నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన కింగ్ నాగార్జున నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా నాగర్జున చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక ఆయన ఎన్ని వైవిధ్యమైన సినిమాలు చేసినా.. అవి ప్రేక్షకులకు రీచ్ అవ్వలేకపోతున్నాయి. ఈ మధ్యకాలంలో నాగార్జున నటించిన సినిమాలలో బంగార్రాజు మినహా మిగతా ఏ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సరైన విజయం అందుకోలేకపోయాయి.

Nagarjuna: Pandemic made me realise you can get wiped out from this world  anytime - Hindustan Times

అందుకే నాగార్జున తన పాత సినిమాలకు భిన్నంగా కొత్త కథలను వెతకటం మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కించిన మోహన్ రాజా తో నాగార్జున ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేశాడు. అయితే గాడ్‌ ఫాదర్ అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోవడంతో నాగార్జున ఆ సినిమాను క్యాన్సల్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు నాగార్జున ఓ కొత్త రైటర్ ని డైరెక్టర్ గా తన సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం చేయబోతున్నారని తెలుస్తుంది.

ఇక రీసెంట్‌గా రవితేజ హీరోగా వచ్చిన ధమాకాకు రైటర్ గా పని చేసిన ప్రసన్న కుమార్ తో నాగార్జున ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ధమాకా సినిమా రవితేజకు అదిరిపోయే సెన్సేషనల్ హిట్ సినిమాగా మిగిలిపోయింది.ఈ సినిమాలో డైలాగులు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించడంతో. నాగార్జున, ప్రసన్నకుమార్ తో ఓ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఆ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్ కూడా నటించబోతున్నారని టాక్.

నాగార్జున అల్లరోడి కాంబోలో రీమేక్ ? -

ఆ సినిమాను మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమాను నాగార్జున ఇప్పుడున్న సినిమాలకి భిన్నంగా కమర్షియల్ కామెడీ మూవీగా రూపొందించబోతున్నారట. ఈ ఇద్దరి హీరోలు కూడా ప్రస్తుతం హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అల్ల‌రి నరేష్ కూడా రీసెంట్ గా వచ్చిన మారేడుమల్లి ప్ర‌జానీకంతో తన కెరియర్‌లో మరో డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాతో ఇద్దరి హీరోలు ఎంతవరకు విజయం సాధిస్తారో తెలియాల్సి ఉంది.