స్టార్ క్రికెటర్ తో లవ్… ఇంట్రెస్టింగ్ మేటర్ ను రివిల్ చేసిన హాట్ బ్యూటీ..!

సినిమా వాళ్లది, క్రికెటర్లది ఎన్నో జన్మల బంధం.. ఈ సంబంధం ఈ నాటిది కాదు గత 50 ,40 సంవత్సరాలుగా ఈ బంధం కొనసాగుతూ ఉంది. సినిమా హీరోయిన్లు క్రికెటర్ల‌ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం, వారితో డేటింగ్ చేయటం, వంటివి ఎప్పుడో మొదలయ్యాయి. వారిలో కొందరు స్టార్ హీరోయిన్లు స్టార్ క్రికెటర్ల‌ను ప్రేమించి పెళ్లాడారు. మరికొందరు మధ్యలోనే విడిపోయారు. మధ్యలో విడిపోయిన వారు ఎందరో ఉన్నారు.

Sayali Sanjeev: Everything To Know About Ruturaj Gaikwad's 'Rumoured  Girlfriend'

ప్రస్తుత కాలంలో టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ పెళ్లి చేసుకుని స్టార్ కపుల్స్ గా కొనసాగుతున్నారు. ఇక టీమిండియా మరో క్రికెటర్ కేఎల్ రాహుల్ మరియు అతియాశెట్టి కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. వీరే కాకుండా ఇప్పుడు మరో యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఓ క్రేజీ హీరోయిన్ తో లవ్ లో ఉన్నట్టు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఆ స్టార్ హీరోయిన్ మరి ఎవరో కాదు మరాఠీ భామ స‌యాలీ సంజీవ్‌. ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని గత కొంతకాలంగా నేషనల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ వార్తలపై మరాఠీ ముద్దుగుమ్మ స్పందించింది.

csk batsman Ruturaj Gaikwad on his relationship speculations with actress  Sayali Sanjeev - एक्ट्रेस सयाली संजीव संग जुड़ा रुतुराज गायकवाड़ का नाम,  CSK ने बल्लेबाज ने दिया रिएक्शन

మా మధ్య ఏం సంబంధం లేదు.. ఈ ఫేక్ న్యూస్ వల్ల మా మధ్య ఉన్న స్నేహం కూడా దెబ్బతింది.. కనీసం మంచి స్నేహితులుగా కూడా మాట్లాడుకోవట్లేదు. మా మధ్య ప్రేమ దోమ ఏమీ లేదు. అయినా మా మధ్య ఏదో ఉన్నట్టు లింక్ ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. దీనివల్ల మా వ్యక్తిగత జీవితానికి కూడా ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి.. ఇలాంటి ఫేక్ వార్తలు పుట్టించే వారికి ఇది అర్థం కావట్లేదా..? అతను గొప్ప ప్లేయర్, ఆ విషయం గురించి మేము కలిస్తే మాట్లాడుకునే వాళ్ళం.. ఇప్పుడు వాటి గురించి కూడా మాట్లాడుకోవడం మానేశాం.. ఈఫేక్ న్యూస్ రాసే వారికి మా భాగ్యస్వాములు ఎంచుకున్న కైనా మా ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమని తెలుసుకుంటారు లేదో.

ఇక ఇప్పుడు ఈ ఫేక్ న్యూస్ ఇంతలా అవటంతో ఇది ఎప్పటికైనా ఇబ్బంది అని గ్రహించి.. అది ఇంట్లో వాళ్లకైనా ఎప్పటికైనా సమస్యగా మారుతుందని అర్థం చేసుకున్నాం..అతను ఎప్పుడైనా విజయం సాధించినప్పుడు కూడా అతనికి విషెస్‌ చెప్పాల‌ని అనిపించినా చేయలేకపోతున్నా .. అని తన మనసులోని బాధను బయటపెట్టింది. ప్రస్తుతం ఆమె కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.