పవన్ కళ్యాణ్ ను దైవంగా పూజిస్తూ ఉంటారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. ఈయన పవన్ కి పెద్ద ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో తీసిన ‘గబ్బరసింగ్’ సినిమా భారీ విజయాలను సొంతం చేసుకుంది. మరో సినిమా ‘తీన్మార్’ ఈ సినిమా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఏదైనా సందర్భాలలో బండ్ల గణేష్ మైక్ పట్టు కునరంటే ఓ రేంజ్ లో పవన్ ను పొగుడుతూ ఉంటారు.. ఇది చూసే వాళ్లకి అతిగా అనిపించినా బండ్ల గణేష్ ఇలాంటి విషయాలను లెక్కచేయరు..
తను అనుకున్నది చెప్పేస్తూ ఉంటారు. అంతటి అభిమానాన్ని గణేష్ పీకే పై పెట్టుకున్నారు.ఆయన ఏం చేసినా పవన్ కళ్యాణ్ పై భజన అని మీడియాలో కథనాలు వచ్చిన వాటిని పట్టించుకోకుండా తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు బండ్ల గణేష్.వీరిద్దరి కాంబినేషన్లో రెండు మూడు చిత్రాలు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తరువాత మళ్లీ బండ్ల గణేష్తో పీకే మరో సినిమా చేస్తానని ప్రామిస్ చేశారట.కానీ పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా వీలుపడలేదు.
ఈ గ్యాప్ లో గణేష్ చాలామంది హీరోలతో చాలా సినిమాలు చేశారు. కానీ పవన్ తో తీసిన ‘గబ్బర్ సింగ్’ సినిమా రేంజ్ ఏ సినిమాకి రాలేదు. దీంతో కొన్నాళ్లపాటు నిర్మాతగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మూడేళ్లుగా మళ్లీ పవన్ తో సినిమా చేయాలని.. వేదిక దొరికిన ప్రతి సందర్భంలో నా దేవుడు నా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంటూ పీకే డేట్లు విషయాన్ని పరోక్షకంగా గుర్తు చేసేవారు. ఈ నేపథ్యంలో తాజాగా గణేష్ చేసిన ట్విట్ నెట్టింట వైరల్ గా మారింది.
వరాలు ఇస్తారని దేవుడి దగ్గరికి వెళ్తాం అక్కడ పెట్టే ప్రసాదాన్ని తింటాం .. లేకపోతే టైం వేస్ట్ ఎందుకు చేసుకుంటాం. అంటూ పోస్ట్ పెట్టాడు. దీన్నిబట్టి పవన్ కళ్యాణ్ కోసం సమయాన్ని వృధా చేసుకోవటం ఎందుకని ఏదో రోజు పవన్ పిలిచి డేట్స్ ఇస్తాడని వెయిట్ చేశారు. ఇక అది జరిగేలా కనపడలేదని అర్థమయింది. అందుకే ఇలా ఓ కొత్త హీరోని సెట్ చేసుకునే ఆలోచనలో పడ్డట్టు రివిల్ చేశారు బండ్ల గణేష్.
వరాలు ఇచ్చే గుడికి వెళ్దాం , దాంతోపాటు ప్రసాదం కూడా తిందాం , లేకపోతే టైం వేస్ట్. no time to live life is most important for our family ❤️🤝
— BANDLA GANESH. (@ganeshbandla) December 4, 2022