హీరో నిఖిల్ ఆ సీరియల్లో నటించాడని తెలుసా..?

టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదట హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ నటుడు ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. యువత సినిమాతో మరింత క్రేజ్ ను అందుకున్న నిఖిల్.. ఆ తర్వాత స్వామి రారా, కార్తికేయ, కిరాక్ పార్టీ, కార్తికేయ -2 సినిమాతో మంచి క్రేజ్ ను అందుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు నిఖిల్.

Young Hero Nikhil Siddharth Impresses With Donations Combined with Human  Touch

ముఖ్యంగా 2013 లో విడుదలైన కార్తికేయ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఈ చిత్రం తర్వాత నిఖిల్ అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకోవడంతో మార్కెట్ను పెంచుకోవడమే కాకుండా అభిమానులను కూడా భారీగా సంపాదించారు. ఇక అప్పుడప్పుడు పలు వాటిపైన కూడా స్పందిస్తూ ఉంటారు నిఖిల్.

ఫోటో వివరణ అందుబాటులో లేదు.
అసలు విషయంలోకి వెళ్తే నిఖిల్ కెరియర్ మొదట్లో ఒక సీరియల్ లో కూడా నటించారు. కానీ ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. నిఖిల్ నటించిన ఆ సీరియల్ పేరు చదరంగం ఈ సీరియల్ లో రాజీవ్ కనకాల తనికెళ్ల భరణితోపాటు హీరో నిఖిల్ కూడా ఓ బుల్లితెర పాత్రను పోషించారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. రీసెంట్గా వచ్చిన కార్తికేయ -2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.ప్రస్తుతం 18 పేజీస్స్, స్పై వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నారు త్వరలోనే ఈ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.