కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న సినిమా ‘వారిసు’. ఇదే సినిమాని తెలుగులో ‘వారసుడు’ అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. అలానే శిరీష్, పీవీపీ కూడా నిర్మాతలుగా ఉన్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వారసుడు సినిమాలో విజయ్ సరసన హీరోయిన్‌గా రష్మిక నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పోస్టర్లు, సాంగ్స్ ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి.
అయితే తమిళ్ లో ‘రంజితమే’ అనే సాంగ్‌ని మూవీ యూనిట్ ఇటీవలే విడుదల చేశారు. ఈ పాటకి యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అలా ఈ పాట సూపర్ హిట్ కావడంతో తాజాగా తెలుగులో కూడా విడుదల చేశారు. ఇక తెలుగు వర్షన్ సాంగ్ కూడా సూపర్ హిట్ అయింది. ఈ పాట విడుదల అయిందో లేదో వెంటనే కొంతమంది ఈ పాటలోని ఫన్నీ థింగ్స్‌ని క్యాచ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్నారు. అసలైతే ఈ పాటకి రష్మిక, విజయ్ ఇరగదీసారనే చెప్పాలి.
@AlwaysJani master @iamRashmika missed her right leg anklet while dancing that signature steps.everyone watching vijay missed rashmika..before uploading video take care..@directorvamshi pic.twitter.com/RJHhLcmtgp
— Ramkumar Rajendran (@ram_sivakasi) November 13, 2022
అంత బాగా డాన్స్ చేసినా నెటిజనులు ఎందుకు ట్రోల్ చేస్తున్నారా అనుకుంటున్నారా? ఈ సాంగ్‌లో రష్మిక, విజయ్ డాన్స్ చేసే సమయంలో రష్మిక కుడి కాలుకి ఉన్న పట్టి జారీ కింద పడింది. అయిన పట్టించుకోకుండా రష్మిక డ్యాన్స్ చేస్తూనే ఉంది. కనీసం మూవీ యూనిట్ కూడా దానిని గమనించకుండా ఆ సాంగ్‌ని అలానే రిలీజ్ చేసేసారు. దాంతో కనీసం పట్టి ఉందా లేదా చూసుకోరా? కాలిపట్టీ ఉడిపోయింది. చూసుకోవాలి కదా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక పట్టీ విషయంపై మూవీ యూనిట్ ఏం చేస్తారో చూడాలి మరి.