బాలయ్యకు యాంకర్ సుమ పోటీనా? అన్ స్టాపబుల్ షోని మించిన షోకి బడా ప్లాన్?

బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో పేరు ఏమిటి అని ఎవరికీ అడగాల్సిన పనిలేదు. ఆయన కనిపించిన ఒకేఒక్క బుల్లితెర షో ‘అన్ స్టాపబుల్ షో’కు ఎలాంటి స్పందన లభిస్తుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆ షో నిర్మాత ఐనటువంటి అల్లు అరవింద్ కూడా మాట్లాడుతూ…. ఇండియాలోనే టాప్ షోగా అన్ స్టాపబుల్ షోని పొగిడిన సంగతి విదితమే. ఇక ఈ షో అంచనాలకు మించి బాగా క్లిక్ అయింది. కాగా ప్రభాస్ ఎపిసోడ్ రెండు భాగాలుగా స్ట్రీమింగ్ కానుండగా ఇప్పటికే రిలీజైన ఫస్ట్ ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

బాలయ్య ప్రభాస్ దెబ్బకు ఆహా యాప్ క్రాష్ అయ్యిందంటే మీరే అర్ధం చేసుకోండి. ఇక రాబోతున్న కాంబినేషన్స్ కూడా పిచ్చెక్కించేలాగా ఉంటాయి. త్వరలో పవన్ – బాలయ్య కాంబినేషన్ కూడా చూడబోతున్నాం. మరి వారి కాంబినేషన్ వచ్చేటప్పుడు ఆహా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడానికే కష్టంగా ఉంది. ఇక ఓటీటీలో ఈ షోకు అంచనాలకు మించి రెస్పాన్స్ వచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే అన్ స్టాపబుల్ షో హిట్టైన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ యాంకర్లలో ఒకరైన సుమ హోస్ట్ గా ఇదే తరహా షో ప్రారంభం కానుందని తెలుస్తోంది.

అయితే క్యాష్ షోకు బదులుగా ఈ షో ప్రసారమవుతుందా? లేక వేరే టైమ్ లో ప్రసారం కానుందా? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకాల్సి వుంది. అయితే బాలయ్యను మించి మెప్పించడం సుమకు సాధ్యమేనా? అనే ప్రశ్నలు ఇపుడు వస్తున్నాయి. ఎందుకంటే సుమకి యాంకరింగ్ కొత్తేమి కాదు, కానీ బాలయ్య తనదైన కామెడీ, బోల్డ్ మార్క్ తో సదరు షోకి రక్తి కట్టించారు. అయితే సుమ ఆ తరహా మాటలు ఆడుతుందా? ఆడితే జనాలు చూస్తారా? అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.