టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన పనిలేదు. దగ్గుబాటి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించినా వెంకటేష్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా లేడీ అభిమానులను సొంతం చేసుకున్న వ్యక్తిగా వెనకటేష్ గారికి మంచి పేరు వుంది. అప్పట్లో ఆయన సినిమాలలో నటించాలని ప్రతి ఒక్క హీరోయిన్ ఆరాటపడేది. ఎందుకంటే ఆయనతో నటిస్తే తప్పకుండా తనకు హిట్ వస్తుందని, అలాగే తెలుగునాట ఇక తిరుగుండదని. అందుకనే కోరి ఆయనతో నటించడానికి పోటీలు పడేవారట.
అంతే కాకుండా తెలుగు పరిశ్రమకు వెంకటేష్ అనేకమంది కొత్త హీరోయిన్లను కూడా పరిచయం చేసాడు. ఆ పేరు కూడా వెంకటేష్ పేరు మీదే వుంది. ఇలా ఆ లిస్టు ఒకసారి ఇకసారి చూద్దాం. నిన్నటి వరకు యావత్ సౌత్ లోనే టాప్ హీరోయిన్ గా ఎదిగిన ఖుష్బూ వెంకీ కలియుగ పాండవులు సినిమాతోనే పరిచయం అయింది. కూలీ నెంబర్ వన్ సినిమాతో టబు టాలీవుడ్ కి పరిచయం కాగా ఆ తర్వాత ఆమె నెంబర్ వన్ హీరోయిన్ గా చెలామణి చేసిన సంగతి తెలిసిందే.
ఇలా చెప్పుకుంటూ పొతే పెద్ద లిస్టే ఉంటుంది. ఒంటరి పోరాటం సినిమాతో ‘రూపిణి’, సుందరకాండ సినిమాతో ‘అపర్ణ’, బొబ్బిలి రాజా సినిమాతో ‘దివ్యభారతి’, పోకిరి రాజా మూవీతో ‘ప్రతిభ సిన్హా’, సాహసవీరుడు సాగరకన్య సినిమాతో ‘శిల్పాశెట్టి’, ధర్మచక్రం సినిమాతో హీరోయిన్ ‘ప్రేమ’, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాతో ‘వినీత’, ప్రేమంటే ఇదేరా సినిమాతో ‘ప్రీతి జింతా’, ప్రేమించుకుందాం రా సినిమాతో ‘అంజలా ఝవేరి’, శీను సినిమాతో ‘ట్వింకిల్ ఖన్నా’, జెమిని సినిమాతో ‘నమిత’, నువ్వు నాకు నచ్చావ్సి నిమాతో ‘ఆర్తి అగర్వాల్’, మల్లీశ్వరి సినిమాతో ‘కత్రినా కైఫ్’, లక్ష్మీ సినిమాతో ‘నయనతార’, గురు సినిమాతో ‘రితికా సింగ్’ వంటివాళ్లను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత వెంకటేష్ గారిదే అని చెప్పుకోవాలి.