ఆ సినిమాని ఎన్టీఆర్ తో చేయాల్సింది.. వక్కంతం వంశీ..!!

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఇక ఎన్టీఆర్ కెరీయర్ని నిలబెట్టిన టెంపర్ సినిమాకి కూడా రచయితగా కథను అందించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు వక్కంతం వంశీ. తాజాగా ఆలితో సరదాగా షో తాజా ప్రోమో ఒకటి వైరల్ గా మారుతోంది. ఇందులో వక్కంతం వంశీ కూడా గెస్ట్ గా రావడం జరిగింది. ఈ షోలో ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా తెలియజేశారు. తన జీవితంలో ఒక రచయితగా మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన చిత్రం కిక్ అని తెలియజేయడం జరిగింది వక్కంతం వంశీ.

Jr NTR to collab with Vetrimaaran on pan-India project

ఇక తర్వాత నా పేరు సూర్య సినిమాని ఒరిజినల్ గా ఎన్టీఆర్ తో చేయవలసిన చిత్రం ఆయనే నన్ను డైరెక్షన్ చేయిస్తానని చెప్పారట. అయితే అప్పటికే టెంపర్ మూవీ ఐడియా చెప్పడంతో అలా ఆయన ఆ మూవీని చేయలేదని ఆ తర్వాత ఆ చిత్రాన్ని అల్లు అర్జున్ కి వినిపించగా ఆయన ఓకే చేశారు. అలా ఆ చిత్రం మిస్సయిందని తెలిపారు వక్కంతం వంశీ. ఇక ఈ షోలో మధ్యలో ప్రముఖ సినీ రచయిత డైరెక్టర్ ,వక్కంతం వంశీ భార్య ఒకప్పటి ఆట ఫేమ్ శ్రీదివ్య రావడం జరిగింది.

కొంతకాలం క్రితం వరకు సోషల్ మీడియాలో కనిపించలేదని ఆలీ అడగగా.. ఎవరైనా మీ మనసు బాధ పెట్టారా అని ఆలీ అడిగేసరికి.. బాధ కంటే పెద్ద పదం ఏదీ లేదని కన్నీటి పర్వంతం చేసింది శ్రీదివ్య. వికాల తన మనస్సులో తన బిడ్డ గురించి చెబుతూ ఒక్కసారిగా ఏడవడంతో ఆలీ కూడా ఈ షోలో కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారుతోంది.

Share post:

Latest