కాబోయే భ‌ర్త‌ను ప‌రిచ‌యం చేసిన త‌మ‌న్నా.. షాక్‌లో నెటిజ‌న్లు!

మిల్కీ బ్యూటీ తమన్నా త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతోందంటూ గత నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలోనూ తమన్నా పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. కానీ వాటిని మిల్కీ బ్యూటీ ఖండిస్తూనే వచ్చింది.

ఇక ఇప్పుడు ముంబైకి చెందిన ఓ బ‌డా వ్యాపార‌వేత్త‌తో తమన్నా ఏడడుగులు నడవబోతోందనే వార్త సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తమన్నా తనుకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసింది. అయితే తమన్నాను పెళ్లాడబోయే అబ్బాయిని చూసి నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు.

అందుకు కార‌ణం లేక‌పోలేదు.. `ఎఫ్ 3` సినిమాలో త‌మ‌న్నా న‌టించిన మెయిల్ గెటప్ కు చెందిన ఫోటోను ఇత‌డే పెళ్లి కొడుకు అంటూ ఆమె ఇన్‌స్టా స్టోరీలో పంచుకుంది. `ఇంట్రడ్యూసింగ్ మై బిజినెస్‌మెన్ హస్బెండ్`.. అంటూ తన పెళ్లి గురించి పోస్ట్ చేసిన పేజ్‌ని ట్యాగ్ చేసింది. అంతేనా `మ్యారేజ్ రూమర్స్.. ప్రతిఒక్కరూ నా లైఫ్ గురించి స్క్రిప్ట్ రాసేస్తున్నారు` అనే హ్యాష్ ట్యాగ్స్ తో పెళ్లి వార్త‌ల‌ను వెరైటీగా కొట్టిపాడేసింది.

https://youtube.com/shorts/kTpCOsd9gRE?feature=share