కాట్రవల్లి కాటుకు స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ బలి.. ఈ వారం హౌస్ ని వీడేది అతనేనా?

కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూస్తున్న తరుణం మరికొద్ది వారాల్లోనే రాబోతుంది. భారీ అంచనాల నడుమ స్టార్ట్ అయిన బిగ్ బాస్ 6 మరికొన్ని వారాల్లో ముగుస్తుంది . ఫైనల్గా విజేత ఎవరవుతారని ఇప్పటినుంచే సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి . పోల్స్ కూడా విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. కాగా అందుతున్న సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో వెబ్ పోల్స్ ఆధారంగా టాప్ ఫైవ్ లో ఉండే కంటెస్టెంట్ లిస్ట్ ఇలా ఉంది .

టైటిల్ విన్నర్ అయ్యేది రేవంత్ అని, ఫైమ రన్నర్ గా మిగులుతుందని ..టాప్ త్రీ లో శ్రీహాన్ ఉంటాడని ..ఆదిరెడ్డి, రోహిత్ నాలుగైదు స్థానాల్లో సరిపెట్టుకుంటారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి . కాగా బిగ్ బాస్ 6 …12వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది . పోల్స్ ఆధారంగా ఫైమ, రాజశేఖర్, శ్రీ సత్య లాస్ట్ 3 ప్లేసెస్ లో ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్లల్లో ఫైమా ఎట్టకేలకు సేఫ్ అయిపోతుంది . ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది ఆమె దగ్గర. ఇక మిగిలింది శ్రీ సత్య – రాజశేఖర్.

రాజశేఖర్ తో కంపేర్ చేస్తే శ్రీ సత్య డబల్ గేమ్స్ బాగా ఆడుతుంది . చాడీలు విపరీతంగా చెబుతుంది . గ్లామర్ గురించి ఇంకా చెప్పనవసరం లేదు . ఇన్ని పాయింట్స్ ఉన్న శ్రీ సత్య ని ఎలిమినేట్ చేసి రాజశేఖర్ ని.. బిగ్ బాస్ ఎప్పటికీ సేవ్ చేయడు . ఈ విషయం బిగ్ బాస్ సీజన్ ఫాలో అవుతున్న అందరికీ తెలిసిందే. ఆ విధంగా ఈ వారం కాట్రవల్లి అని పేరు తెచ్చుకున్న శ్రీ సత్య కాటుకు రాజశేఖర్ బలైపోయాడు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఎన్ని వారాలు సేవ్ అయినా సరే శ్రీ సత్య టాప్ ఫైవ్ లో ఉండకూడదు అంటూ జనాలు గట్టిగా కోరుకుంటున్నారు. దీనితో శ్రీ సత్య ఫ్యాన్స్ ఆమెకు ఎలాగైనా ఓట్లు వేసి టాప్ ఫైవ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు . చూడాలి మరి లాస్ట్ కి ఏం జరగబోతుందో..?

Share post:

Latest