నవ్వుల పాలవుతున్న పవన్ కళ్యాణ్.. మరి ఇంతలానా..?

టాలీవుడ్ లో హీరో పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు సినిమాలలో నటిస్తు అభిమానులను సరికొత్త ఉత్సాహాన్ని నింపేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి పవన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా పలు ప్రాంతాలను కూడా చుట్టేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.వైసీపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు నిజం కాదని ఇప్పటం ప్రజలు తాజాగా తెలియజేయడం జరిగింది. అందుకు సంబంధించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

Pawan Kalyan Janasena : కరెక్ట్ ట్రాక్‌లోకి వచ్చిన పవన్ కళ్యాణ్... నిధుల  కోసం వేట - Pawan Pumps Money To Gain Peoples Support , Jagan , Pawan Kalyan  , Janasena , Ysrcp , Ap,Tenant Farmers

ఇక అంతే కాకుండా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ విలువ రోజురోజుకి దిగజారి పోతోందని కేఏ పాల్ ఆరోపణలు చేశారు. ఏ నాయకుడు చేయని విధంగా పవన్ కళ్యాణ్ ఏకంగా 9 పార్టీలు మారారని కామెంట్స్ చేయడం జరిగింది. జనసేన పార్టీని స్థాపించి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అవుతోంది.. కానీ ఇంతవరకు ఒక్క సొంత సీటు కూడా గెలుచుకోలేదని పవను ఎద్దేవా చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో కేఏపాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

దీంతో కొంతమంది నేటిజెన్లు సైతం పవన్ కళ్యాణ్ అనవసరంగా నవ్వుల పాలవుతున్నారని కామెంట్స్ చేస్తూ ఉన్నారు.అటు ఇప్పటం ప్రజలు కూడా తమ ఇళ్ళని ప్రభుత్వం కూల్చలేదని తమ ఇంటి ముందర ఫ్లెక్సీలను కూడా వేయించారు. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం కమెడియన్ ఆలీ కూడా పవన్ కళ్యాణ్ పై పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది.

paul criticizes pawan kalyan for targeting him,pawan kalyan, ka pal,  andhrapradesh, comments, prajarajyam, janasena - Telugu Andhrapradesh,  Janasena, Ka Pal, Pawan Kalyan, Prajarajyamపవన్ కళ్యాణ్ టిడిపి తో కలిసి పోవడంతో అభిమానుల్లో కూడా నిరుత్సాహం మొదలైంది.. ఇప్పుడు తాజగా కే ఏ పాలు కూడా పవన్ కళ్యాణ్ ని ఎద్దేవా చేయడంతో అభిమానులు సైతం కాస్త నిరుత్సాహ పడుతున్నారు. మరి రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులు వేస్తారేమో చూడాలి.

Share post:

Latest