ఎన్నికల సమయం ఆసన్నమవుతుంది…మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్నాయి..కాబట్టి ఇప్పటినుంచే ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలైంది..అధియాకర-ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుంది. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే..రాజకీయం మరింత రంజుగా మారుతుంది. ఏదేమైనా గాని ఏపీలో పార్టీలు…ఎన్నికలే టార్గెట్గా ముందుకెళుతున్నాయి. మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలని వైసీపీ…ఈ సారి ఖచ్చితంగా గెలిచి తీరాలని టిడిపి చూస్తుంది.
అయితే రాష్ట్రంలో వైసీపీకి ధీటుగా టిడిపి బలం పెరుగుతుంది..అదే సమయంలో జనసేన..టిడిపితో కలిసి ముందుకెళ్లెలా ఉంది..అప్పుడు రాజకీయం మరింత రంజుగా మారుతుంది. టిడిపి-జనసేన కలిస్తే..ఆ పార్టీలకే కస్త ఎడ్జ్ వస్తుంది. పైగా వైసీపీపై వ్యతిరేకత కలిసొచ్చే అవకాస్లౌ ఉన్నాయి. ఈ క్రమంలోనే కొందరు వైసీపీ నేతలు..టిడిపి-జనసేనల వైపు చూస్తున్నారని తెలుస్తోంది. కాకపోతే వారు ఇప్పుడు పార్టీ మారడం జరగదని, ఎన్నికల ముందే జంపింగులకు రెడీ అవుతారని తెలుస్తోంది.
ముఖ్యంగా వైసీపీలో సీట్లు దక్కని వారు..పార్టీ మారే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే కొంతమందికి సీటు డౌట్ అని జగన్ చెప్పేశారు..అలాంటి వారు ముందు జాగ్రత్తగా టిడిపి-జనసేనలతో టచ్లోకి వెళుతున్నారట. పొత్తులో భాగంగా సీటు ఏ పార్టీకి వస్తే..ఆ పార్టీలో కర్చీఫ్ వేసుకోవడానికి చూస్తున్నారట. అది కూడా సీటు గ్యారెంటీ అంటేనే పార్టీ మారాలని చూస్తున్నారట. మాజీ మంత్రులు కావచ్చు, కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావచ్చు..సీనియర్ నేతలు కావచ్చు..దాదాపు 30 మంది వరకు వైసీపీ నేతలు..టిడిపి-జనసేన వైపు వెళ్లడానికి రెడీ అవుతున్నారట.
ఇక పార్టీ మారతారు అనుకునేవారిపై జగన్ సర్కార్ నిఘా కూడా పెట్టిందని తెలిసింది. ఇంటిలిజెన్స్ ద్వారా సమాచారం తెలుసుకుని, పార్టీ మారడానికి రెడీగా ఉన్నవారిని ఓ కంటకనిపెడుతున్నారట. వారిలో ఇమేజ్ ఎక్కువ ఉన్నవారిని పార్టీ మారకుండా ఉండేలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారని సమాచారం. అయితే ఈ జంపింగులు ఎన్నికల సమయంలోనే ఉంటాయి. ప్రస్తుతం అధికారాన్ని వదులుకుని పార్టీ మారడానికి ఎవరు సిద్ధంగా లేరు.