త‌ళుకుల చీర‌లో బేబ‌మ్మ మెరుపులు.. ఏం అందంరా బాబు!

సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా తెర‌కెక్కించిన `ఉప్పెన` సినిమాతో బేబ‌మ్మగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ సెన్షేష‌న్ కృతి శెట్టి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్‌ను అందుకుని యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న‌ ఈ భామ.. ఆ వెంటనే `శ్యామ్ సింగ‌రాయ్‌`, `బంగార్రాజు` చిత్రాలతో మరో రెండు విజయాలను ఖాతాలో వేసుకుంది.

krithi shetty latest gallery
krithi shetty latest gallery

వ‌రుస హిట్ల నేప‌థ్యంలో కృతి శెట్టికి ఇక‌ తిరుగుండదని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. ఈ బ్యూటీ నుంచి చివ‌ర‌గా వ‌చ్చిన‌ మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి.

దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ సరైన హిట్టు కోసం ఎదురుచూపులు చూస్తోంది. ఇదిలా అంటే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే బేబమ్మ తరచూ అదిరిపోయే ఫోటోషూట్లతో కుర్ర కారును ఆగ‌మాగం చేస్తుంటుంది. తాజాగా కూడా తళుకుల చీరలో మెరుపులు మెరిపించింది.

సిల్వర్ కలర్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించిన కృతి శెట్టి.. లూస్ హెయిర్‌లో ఓరకంట చూస్తూ ఎరుపెక్కిన పెదాలతో కవ్వించే విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ పిక్స్ ను చూసిన నెటిజ‌న్లు ఏం అందంరా బాబు అంటూ కృతి శెట్టిపై పొగడ్తల‌ వర్షం కురిపిస్తున్నారు.

కాగా, సినిమాల విషయానికి వస్తే.. కృతి శెట్టి తెలుగులో నాగచైతన్యకు జోడిగా ఓ సినిమా చేస్తోంది. అలాగే తమిళ, మలయాళ భాషల్లో సైతం పలు ప్రాజెక్టులను టేకప్ చేసింది.

Share post:

Latest