పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇండస్ట్రీకి దూరం అవడానికి కారణం ఇదేనా..!!

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బంగారం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన మీరా చోప్రా మీకు గుర్తుందా? బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కావాలని ఎన్నో ఆశలతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఈమె ఫ్యామిలీ నుంచి ఈమె కంటే ముందే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ప్రియాంక చోప్రా మరియు పరిణితి చోప్రా, మన్నారా చోప్రా… ఇక మీరా చోప్రా కూడా వారి లాగా హీరోయిన్‌ అవ్వాలని సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది.

Bangaram Telugu Full Length Movie || Pawan Kalyan, Meera Chopra, Reema Sen  || Telugu Hit Movies - YouTube

అయితే ఈముద్దుగుమ్మకు తన కుటుంబంలో ఇంత మంది హిరోయిన్‌లు ఉన్న‌ బాలీవుడ్ లో ఒక్క సినిమాలో కూడా నటించలేక పోయింది. మొదట ఈ ముద్దుగుమ్మ ‘అంబే ఆరూయిరే’ అని తమిళ్ సినిమాతో తన సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ సినిమాలలో నటించింది. ఇక ఈమె అగ్ర హీరోలతో నటించిన స్టార్ హీరోయిన్‌ అవ్వలేకపోయింది. తర్వాత పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించింది.

రీసెంట్గా ఈ ముద్దుగుమ్మ ‘టాటూ మర్డర్స్’ అనే హిందీ వెబ్ సిరీస్ లో కూడా నటించి తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టింది. ఈ ముద్దుగుమ్మకు సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాలు ఎంతవరకు వస్తాయో చూడాలి. ఈ వెబ్ సిరీస్ కన్నా ముందు ‘నాస్తిక్’ అనే హిందీ సినిమా కూడా ఈమె ఒప్పుకుంది. టాలీవుడ్ లో ‘మొగిలి పువ్వు’ అనే ఓ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమాలు విజయం సాధిస్తే మీరా మళ్లీ ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాల విషయం పక్కన పడితే ఈ ముద్దుగుమ్మకు పబ్లిసిటీ అంటే ఎంతో పిచ్చి.. ఆ పబ్లిసిటీ పిచ్చితో తన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఒకసారి తన అక్క పరిణితికి నాకు ఏం సంబంధం లేదు అంటూ సంచలన ఆరోపణలు చేసింది. అప్పుడు ఇది బాలీవుడ్ లో పెద్ద రచ్చ కూడా అయింది.

తర్వాత ఓ ఇంటర్వ్యూలో తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్ మీద కూడా ఈమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఎవరో నాకు అసలు తెలియదంటు కామెంట్లో చేసింది. ఈమె చేసిన కామెంట్లు సౌత్ ఇండియాలో కూడా సంచలనంగా మారాయి. తర్వాత ఈ ముద్దుగుమ్మ‌ కరోనా టీకాల విషయం మీద కూడా ఆరోపణలు కుప్పించింది. దీంతో ఈ అమ్మడి పై సోషల్ మీడియాలో బీజేపీ పార్టీ సైతం ఈ ముద్దుగుమ్మ పై వీరు చేయబడింది. ఇలా సంబంధం లేని విషయాల్లో వీలు పెట్టి మరి సినిమా పరిశ్రమకు దూరమైంది ఈ ముద్దుగుమ్మ.

Share post:

Latest