సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మెన్ 3 వచ్చేస్తుంది..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే నయనతార తర్వాత ఆ రేంజ్‌ క్రేజ్ ఉన్న హీరోయిన్ సమంత. ఈమె టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా అందరూ స్టార్ హీరోలతో జతకట్టింది. ఇక టాలీవుడ్ లో తన మొదటి సినిమా హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి 2017లో వివాహం చేసుకున్నారు. ఇక తర్వాత వీళ్ళ మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక ఎవరి జీవితం వారు గడుపుతున్నారు.

Samantha Akkineni's 'BOLD' scenes in The Family Man 2 going viral; but why

ఈ విషయాలన్నీ పక్కన పెడితే సమంత బాలీవుడ్ లో తొలిసారిగా నటించిన ఫ్యామిలీ మెన్2 వెబ్ సిరీస్ తో తన లైఫ్ లో ఎవరూ ఊహించిన మార్పులు కూడా వచ్చాయి. తను విడాకులు తీసుకోవ‌డానికి ఈ వెబ్ సిరీస్ కూడా కారణమని ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ లో సమంత తాను అప్పటివరకు చేయని నెగిటివ్ మరియు బోల్డ్ క్యారెక్టర్ల‌లో కనిపించింది. ఇక దాంతో అక్కినేని అభిమానులు సమంతా అభిమానులు తన క్యారెక్టర్ చూసి అందరూ షాక్ అయ్యారు.

The Family Man 2': Manoj Bajpayee, Samantha Akkineni's show starts  streaming ahead of the announced date

ఆ సిరీస్‌లో మనోజ్ భాజ్ పాయ్‌ హీరోగా నటించ‌గా ప్రియమణి అతని భార్యగా నటించింది. మనోజ్ కు ప్రతి నాయకురాలుగా సమంత నటించింది. ఈ సిరీస్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది సమంతకు బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ కూడా వచ్చింది. ఇక‌ ఇప్పుడు ఈ సిరీస్ కు మూడో సీజన్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.

The Family Man 2 Exclusive! Manoj Bajpayee On Samantha Akkineni: “She's Put  Her Heart & Soul In The Show”

ఈ సీజన్ ను వచ్చే సంవత్సరం సమ్మర్ లేదా దసరా టైమ్‌కి మొదలు పెడతారని తెలుస్తుంది. ఆ సమయానికి సమంత తన పూర్తి ఆరోగ్యంతో కోలుకొని ఈ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటుందట. ఈ సిరీస్ లో కూడా సమంత తనలోని మరో వైవిధ్యమైన ప్రతినాయకరాల‌ని చూపించబోతుందని తెలుస్తుంది. ఈ సిరీస్ తో సమంత ఇలాంటి సంచలనాలు క్రియేట్ చేయబోతుందో చూడాలి.