మోలీవుడ్ భామ సాయి పల్లవికి తెలుగులో మంచి పాపులారిటీ వచ్చింది. ఇక్కడ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ వుంది. సాయి పల్లవికి ఇక్కడ ప్రత్యేకించి ఫ్యాన్స్ బేస్ వుంది. అందువలనే ఇక్కడ ఈమె తిరుగులేని తారగా వెలుగొందుతోంది. పైగా ఇక్కడ సహజనటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసిన సాయి పల్లవి ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందనే వార్త సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సాయి పల్లవి ఇకపై సినిమాల్లో నటించదనే వార్తకు బలం చేకూర్చే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
సాయి పల్లవికి ఇక్కడ ప్రత్యేకమైన గుర్తింపు వుంది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ తనదైన శైలిలో రాణించడం ఆమెకే చెల్లింది. అందుకే ఆమెమీద అభిమానులలో సాఫ్ట్ కార్నర్ వుంది. ఆమె తాజాగా రానాతో నటించిన విరాటపర్వం ఫలితం ఎలావున్నా, ఆమె పోషించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమా వచ్చిన గార్గి సినిమా ఫలితం కూడా అటుఇటు వున్నా పేరు మాత్రం సాయి పల్లవి కొట్టేసింది. అదే ఆమె ప్రత్యేకత. సినిమా ఎలాంటిదైనా తన పాత్రకు ప్రత్యేక గుర్తింపు వస్తుంది.
అయితే తరువాత మాత్రం ఆమె చేసిన సినిమా సంగతి మనకు వినబడటం లేదు. ఆ తరువాత ఆఫర్లు వచ్చినా తిరస్కరించిందని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. సినిమాలకు ఎందుకు దూరంగా ఉందని ఆందోళన చెందుతున్న ఆమె అభిమానులకు ఇప్పుడు షాక్ తగిలింది. సాయిపల్లవి త్వరలో సినిమాల్ని వదిలేస్తుందని భోగట్టా. వృత్తిరీత్యా డాక్టర్ అయిన సాయి పల్లవి.. నటనపై ఆసక్తితో సినిమాల్లో వచ్చింది. అయితే ఇప్పుడు తిరిగి వైద్యవృత్తి కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టుగా సమచారం.