Bigg Boss 6: వామ్మో, 12 వారాలకు కంటెస్టెంట్ రాజ్ అన్ని లక్షలు తీసుకున్నాడా?

బిగ్ బాస్ సీజన్ 6 మరో 3 వారాల్లో చివర దిశకు చేరుకోనుంది. దాంతో ఈ సీజన్ టైటిల్ విన్నర్ చిక్కుముడి వీడిపోనుంది. కాగా ప్రస్తుతం హౌస్లో 8 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. వారిలో ఒకరు టైటిల్ గెలుచుకోనున్నారనే విషయం తెలిసినదే. కాగా ఈ 12వ వారం కంటెస్టెంట్ రాజశేఖర్ అలియాస్ రాజ్ ఎలిమినేట్ అయిన సంగతి కూడా విదితమే. ఫైమా,రాజ్ లలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఎవిక్షన్ పాస్ తో ఫైమా సేవ్ అయ్యి బయపటపడింది. కాగా రాజ్ ఎలిమినేషన్ పలు విమర్శలకు దారి తీసింది.

నామినేషన్స్ లో ఉన్న సభ్యులలో తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ని మాత్రమే ఎలిమినేట్ చేయాలన్న బేసిక్ రూల్ ఇక్కడ బ్రేక్ చేయడమే దానికి కారణం. ఫైమా కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న రాజ్ ని ఎలా ఎలిమినేట్ చేస్తారని సోషల్ మీడియాలో నెటిజన్ల నుండి వత్తిడి వస్తోంది. బిగ్ బాస్ సీజన్ 4 లో సేమ్ సిట్యుయేషన్ అరియనా, అవినాష్ కి ఎదురైంది. అవినాష్ కంటే ఎక్కువ ఓట్లు అరియనాకు రావడంతో ఆమె కూడా సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. 3 వారాల్లో నలుగురు కంటెస్టెంట్స్ ని ఇంటికి పంపాల్సి ఉండగా.. అడ్డదిడ్డంగా ఎలిమినేట్ చేస్తున్నారనే వాదనలు కూడా మనకి వినిపిస్తున్నాయి.

అయితే ఈ క్రమంలో కాగా 12 వారాలున్న రాజ్ రెమ్యూనరేషన్ గా తీసుకున్న అమౌంట్ ఎంత ఉంటుందని అందరిలోనూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అందుతున్న సమాచారం ప్రకారం వారానికి రూ. 1.40 లు ఒప్పందంపై హౌస్లోకి వెళ్ళాడట రాజ్. ఆ లెక్కన రాజ్ రూ. 16.8 లక్షలు అందుకున్నాడని సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం ఇంకా ఏది లేకున్నప్పటికీ టాక్ ఇలాగే వినిపిస్తోంది. కాగా గత 5 సీజన్స్ లో ఎలాంటి నెగిటివిటీ లేకుండా బిగ్ బాస్ హౌస్ నుండి బయటకొచ్చిన కంటెస్టెంట్ రాజ్ కి ఘన స్వాగతం లభించింది.