అలాంటి ప‌ని చేసి అడ్డంగా బుక్కైన బిగ్ బాస్ బ్యూటీ.. కేసు న‌మోదు!

ఉర్ఫీ జావెద్.. ఈ బిగ్ బాస్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయనవసరం లేదు. అయితే బిగ్ బాస్ హిందీ ఓటిటి మొదటి సీజన్ ద్వారా ఉర్ఫీ చాలా పాపులర్ అయింది. అంతేకాదు ఆమె బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పటికంటే బయటకు వచ్చిన తర్వాత ఆమె తన వెరైటీ దుస్తులతో చేసే రచ్చతో నిత్యం మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది.

వెరైటీ దుస్తులు, డిఫరెంట్ డిజైన్లతో ఉర్ఫీ వేసుకున్న బట్టలలో అందాలను చూపించి, చూపించకుండా అందరికీ మెంటల్ ఎక్కిస్తుంటుంది. ఇక ఆమె ధరించే వింత దుస్తులపై ఎన్నో ట్రోలింగ్స్ వస్తుంటాయి. తాజాగా ఉర్ఫీ జావెద్ మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఆమె నటించినా `యే మజ్జూరి` అనే ఆల్బమ్ సాంగ్ తో అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ ఆల్బమ్ లో ఆమె ధరించిన దుస్తులు అలాగే ఆమె ఆ పాటలో వాడిన పదజాలాలు ఎంతో అసభ్యకరంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఈ సాంగ్ లో ఆమె డాన్స్ తీరు అలాగే పాడిన పదాల తీరు లైంగిక పరంగా రెచ్చగొట్టే విధంగా ఉందని వాదనలు కూడా వస్తున్నాయి. ఇక ఈ కారణంగానే ఉర్ఫీ జావెద్ పై న్యూఢిల్లీలో కేసు నమోదు అయిందట. ఇక ఈ వార్త తెలిసిన నెటిజన్లు అలాంటి పని చేసి అడ్డంగా బుక్ అయిపోయిన బిగ్ బాస్ డ్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.