పెళ్లైన మగాడిలో అది బాగుంటుంది.. శృతిమించేసిన స్టార్ డాటర్ మాటలు..!?

లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది శృతిహాసన్. శృతిహాసన్ తన కెరియర్ మొదటిలో అపజయాలను ఎదుర్కొంది. ఐరన్ లాగానే ముద్ర కూడా వేసుకుంది. శృతిహాసన్ కెరియర్ క్లోజ్ అయిపోయిందన్న టైం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమాలో నటించింది. ఈ సినిమా శృతిహాసన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత నుంచి శృతిహాసన్ కెరియర్ మరో లెవల్ కి వెళ్ళింది. వరుస పెట్టి స్టార్ హీరోలతో నటిస్తూ ఆ టైంలో అయినా హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చింది.

శృతిహాసన్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో ప్రేమ వ్యవహారాలు కూడా బాగానే నడిపింది.
శృతిహాసన్ మొదట స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్‌ తో కొన్నాళ్లు ప్రేమలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. తర్వాత శృతిహాసన్ ఓ విదేశీయుడుతో ప్రేమలో పడింది. వీరిద్దరూ కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారు. తాజాగా వీరిద్దరి మధ్య బ్రేకప్ అయింది. దీంతో శృతిహాసన్ మళ్ళీ సినిమాలలో నటించడం మొదలుపెట్టింది. శృతిహాసన్ ‘క్రాక్’ సినిమాతో రీయంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో అదిరిపోయే హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు శృతిహాసన్ సీనియర్ హీరోలతో వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా కొనసాగుతుంది.

గతంలో శృతిహాసన్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మనకు తెలిసింది శృతిహాసన్ టాలీవుడ్ లో ఉండే స్టార్ హీరో తో ఎక్కువ క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పటికే ఈ భామ ఆ స్టార్ హీరో తో బ్లాక్ బస్టర్ సినిమాల్లో కూడా నటించింది. అఫ్కోర్స్ ఆయనకి ఆల్రెడీ పెళ్లి అయినా గాని శృతిహాసన్ ఆయనపై మనసు పడేసుకున్నట్టు ఆమె మాటలు ఆధారంగా తెలుస్తుంది. శృతిహాసన్ గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ టాలీవుడ్ హీరోపై ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించింది. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే అలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని చేసుకుంటాను అంటూ పెళ్లయిన హీరో అని మరిచి ఆ హీరో పై ఆసక్తికర కామెంట్లు చేసింది. దీంతో ప్రస్తుతం శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పింది… అన్న రూమర్లు బయటికి రాగానే శృతిహాసన్ ఆ స్టార్ హీరోతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.